హైదరాబాద్ బేగంబజార్లో జమున, గంగ, బచ్చి, జయమంగల్, పుల్కారి గుర్రాలు పెళ్లిళ్లకు అద్దెకిస్తుంటారు. కొంతజంట అశ్వికరథంపై ఊరేగించేందుకు ఈ గుర్రాలను ఉపయోగిస్తారు. లాక్ డౌన్ వల్ల పెళ్లిళ్లు నిలిచిపోవడంతో ఈ అశ్వాలు ఇళ్లకే పరిమితమయ్యాయి. చాలా రోజుల నుంచి వాటిని కట్టేయడంతో జబ్బు పడుతున్నాయని, వింతగా ప్రవర్తిస్తున్నాయని గమనించిన మయాంక్, ఇమ్రాన్, సాబీర్, సోయల్, గచ్చాలు... సరదాగా వాటిని బయటకు తీసుకెళ్లాలని భావించారు. కానీ బయట పోలీసులు కొన్నిరోజులు వారించారు.
ఇటీవలే ఆంక్షలు సడలించడంతో తమ గుర్రాలను ట్యాంక్ బండ్పై దౌడు తీయిస్తున్నారు. ఫలితంగా వాటిలో కొత్త ఉత్సాహం వస్తుందని, మునపటిలాగే ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటాయని చెబుతున్నారు. రోజు విడిచి రోజు సాయంత్రం గంటపాటు ట్యాంక్ బండ్పై పరుగెట్టిస్తున్నారు. అటువైపుగా వెళ్లే వాహనదారులు అశ్వాల దౌడును చూస్తూ ఆనందిస్తున్నారు.
ఇదీ చదవండి: 'కరోనా.. నీవల్ల మా హీరో రాక ఆలస్యమైంది'