ETV Bharat / state

విశాఖలో వందేభారత్ రైలుపై రాళ్లు రువ్విన పోకిరీలు.. అద్దాలు ధ్వంసం

రైల్వే వ్యవస్థలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైలు వందేభారత్. ఈ రైలు అత్యంత వేగంగా ప్రమాణికులను గమ్యస్థానానికి చేర్చుతుంది. ఈ నెల 15న దక్షిణ భారతదేశంలో తొలిసారిగా వందేభారత్​ రైలును ప్రారంభించనున్నారు. దీనికోసం నిర్యహణలో భాగంగా రైలును ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నానికి ఈరోజు తీసుకువచ్చారు. అయితే కొంతమంది పోకిరీలు ఏం చేశారో తెలుసా..?

Hooligans threw stones at Vande Bharat train in Visakhapatnam
వందేభారత్ రైలుపై రాళ్లు
author img

By

Published : Jan 11, 2023, 10:27 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో పోకిరీలు రెచ్చిపోయారు. విశాఖకు వచ్చిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్లు విసిరారు. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం విశాఖ రైల్వే స్టేషన్‌కు ఈ రైలును రప్పించారు. సిబ్బంది, రైల్వే అధికారులు పరిశీలించిన అనంతరం సాయంత్రం కంచరపాలెం రామ్మూర్తిపంతులుపేట వద్ద రైలును నిలిపి ఉంచారు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందే భారత్‌ రైలు రెండు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. రైలుపై రాళ్లు విసిరిన ఆకతాయిల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు.

దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వందే భారత్ రైలు తొలిసారి విశాఖ రైల్వేస్టేషన్​కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా ఇవాళ ఉదయం రైల్వేస్టేషన్​కు ఈ రైలును రప్పించారు. పూర్తిగా చైర్ కార్ బోగీలున్న ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని అందువల్ల ఈ వందే భారత్ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు ప్రయాణికులకు సౌకర్యవంతగా ఉంటుందని.. 9.30 గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్​కు చేరుకుంటుందని తెలిపారు.

విశాఖ నుంచే రైలు నిర్వహణ జరగనుంది కావున పర్యవేక్షణ నిమిత్తం న్యూ కోచింగ్ కాంప్లెక్స్​కు పంపించారు. లోకో పైలెట్ క్యాబిన్​కు అనుసంధానంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ రైలు మొత్తం ఉంది. లోకో పైలెట్ ఆధీనంలో కోచ్​ల ద్వారాలు తెరుచుట, మూయుట వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల అత్యవసర సహాయార్ధం ద్వారం వద్ద టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన టాయిలెట్ ఈ కోచ్ ప్రత్యేకత. ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు రైల్వే శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.