కరోనా వేళ అమూల్యమైన సేవలందిస్తున్న సినీనటుడు సోనూసూద్‌ను కీర్తిస్తూ... ఆయన చిత్రాన్ని గీసిన గుంటూరు జిల్లాకు చెందిన యశ్వంత్ ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. 2 గంటల 57 నిమిషాల్లో 273 చదరపు మీటర్ల స్థలంలో సోనుసూద్ చిత్రాన్ని వేసినందుకు.... భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్.. 12 ప్రపంచ రికార్డులను ప్రదానం చేశాయి. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో యశ్వంత్‌ను సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన దాసరి యశ్వంత్ కుమార్ 2 గంటల 57 నిమిషాల్లో 273 చదరపు మీటర్లలో నేలపైన సోనూసూద్ చిత్రాన్ని గీశారు. ఈ చిత్రానికి 12 ప్రపంచ రికార్డులు దక్కాయి. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో... ప్రపంచ రికార్డుల భారత ప్రతినిధి రమణారావు, దక్షిణ భారత ప్రతినిధి శ్రీవిద్య వీటిని అందజేశారు.
గతంలో ప్రముఖుల చిత్రాలను ఏకకాలంలో చెయ్యి, కాలు, నోటితో గీసి తన నైపుణ్యాన్ని చాటుకున్నారని రమణారావు తెలిపారు. సోనూసూద్ స్ఫూర్తితోనే తాను ఈ ప్రపంచ రికార్డులను నెలకొల్పానని... వీటిని ఆయనకే అంకితం చేస్తున్నట్లు యశ్వంత్ తెలిపారు. పలువురు ప్రముఖుల చిత్రాలు గీసి యశ్వంత్ అందరి మెప్పుపొందుతున్నారు.
ఇదీ చదవండి: Sonu sood: సోనూసూద్ సిత్రం.. 12 ప్రపంచ రికార్డులు నమోదు