ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద ఉంటున్న పేదలు... వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సీఎం భద్రత దృష్ట్యా... అమరారెడ్డినగర్ వాసులను ఖాళీ చేయించి ఆత్మకూరులో ఇళ్లస్థలాలు కేటాయించారు. పరిహారం పంపిణీలో స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డితోపాటు మరికొందరు నేతలు తమకు అన్యాయం చేశారంటూ ఇళ్లముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. స్థలాల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపించారు.
ఇదీ చూడండి: KCR: ఎస్సీ సాధికారతపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష