ETV Bharat / state

పగలు ఎండలో సలసల.. రాత్రి దోమలతో విలవిల - GHMC Migrant labours Care

లాక్‌డౌన్‌ నిరాశ్రయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఉపాధి కోసం నగరానికి వచ్చి ఎక్కడ తల దాచుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడా గూడు దొరక్కపోవడం వల్ల రాత్రిపూట రోడ్లపైనే సేద తీరుతున్నారు.

అధికారులు సంరక్షించిన నిరాశ్రయులు
అధికారులు సంరక్షించిన నిరాశ్రయులు
author img

By

Published : Mar 30, 2020, 2:12 PM IST

ఉపాధి కోసం నగరానికి వచ్చిన నిరాశ్రయులకు లాక్‌డౌన్‌ దృష్ట్యా సంకటస్థితి నెలకొంది. పగలంతా ఎండతో, రాత్రి దోమలతో పోరాటం చేస్తున్నారు. ఇంటికెళ్లే పరిస్థితి లేక రోడ్లపైనే ఉంటున్నారు. నిరాశ్రయుల యోగక్షేమాలను పట్టించుకోవడంలో బల్దియా చేతులెత్తేయడం వల్ల దయనీయంగా తయారైంది వీరి పరిస్థితి. ఆహారం కోసం అన్నపూర్ణ కేంద్రాన్ని, నిద్రించేందుకు రోడ్లను వెతుక్కునే పరిస్థితి దాపురించింది.

100 కి.మీ. నడిచేందుకూ సిద్ధం..

  • నగరంలో నిరాశ్రయులను గుర్తించి వసతి గృహాలకు తరలించాల్సిన వాహనం జాడ లేదు. లాక్‌డౌన్‌తో సొంత ఊళ్లకు వెళ్లలేక, ఇక్కడ నివాసం ఉన్న ఇళ్లకు అద్దెలు కట్టలేక కుటుంబాలతో సహా రోడ్డు మీదకొచ్చారు. 100 కిమీ. ఉన్నా నడిచి సొంతూళ్లకు వెళ్తామనే నిర్ణయానికి వచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
  • నగరంలో 3000 మంది నిరాశ్రయులున్నట్లు అంచనా. వీరంతా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూలినాలీ చేసుకుందామని వచ్చిన వాళ్లే. జీహెచ్‌ఎంసీ వసతి గృహాలు పూర్తిగా నిండిపోవడం వల్లే నైట్‌షెల్టర్‌ వాహనాలు తిరగడం లేదని అధికారులు చెబుతున్నారు. నగరంలో ఉన్న 12 వసతి గృహాలు 1500 మందికి మాత్రమే ఆశ్రయం కల్పిస్తున్నాయి.

యూసుఫ్‌గూడ సర్కిల్‌-19 పరిధిలో..

జీహెచ్‌ఎంసీ యూసుఫ్‌గూడ సర్కిల్‌-19 పరిధిలో 25మంది నిరాశ్రయులను గుర్తించామని డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ పేర్కొన్నారు. రాత్రి షెల్టర్‌లో ఇప్పటికే 26 మంది ఉన్నారని వారికి తోడు కొత్తగా గుర్తించిన 25 మందికి పక్కనే ఉన్న సెట్విన్‌ కేంద్రం ఆవరణలో ఏర్పాట్లు చేశామని డీఎంసీ తెలిపారు.

కళాశాలలు, విద్యాసంస్థలను వాడుకోవచ్చు..

షెల్టర్‌హోంలో ఇతరులను తీసుకొచ్చే వెసులుబాటు లేకపోతే ప్రత్యామ్నాయాలను చూడాలంటూ సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే నగరంలోని విద్యాసంస్థలు, వందలాది శిక్షణ కేంద్రాలు మూసివేశారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు వీటిని నిరాశ్రయుల వసతి గృహాలుగా మార్చాలని సూచిస్తున్నారు. వీరికి మాస్క్‌లు, శానిటైజర్లు అందించి వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించాలని చెబుతున్నారు.

పాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వసతి

నిరాశ్రయులకు ఉప్పల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వసతి కల్పిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ఉప్పల్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ కృష్ణశేఖర్‌, పీవో రమాదేవి తెలిపారు. మొత్తం 16 మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఓ మహిళ ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరినీ మహిళల రాత్రి బస కేంద్రానికి మిగతావారిని క్యాంపు కార్యాలయానికి తరలించారు.

ఇదీ చూడండి: 'అదుపులోనే ఉంది.. అయినా మరో మూడువారాలు తప్పదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.