ETV Bharat / state

కరోనా వస్తే.. ఆస్పత్రికి వెళ్లడం కంటే ఇల్లే మేలట! - హోం క్వారంటైన్​ చికిత్స

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి ఉంది. కొన్నిసార్లు పడకల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. అయితే లక్షణాలు లేకుంటే ఆసుపత్రులకు రావల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి నుంచే వైద్య సేవలు పొందాలని పేర్కొంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి.

corona
corona
author img

By

Published : Jun 30, 2020, 7:48 AM IST

వైరస్‌ సోకిన తర్వాత చికిత్స తీసుకుందామంటే మహానగరంలోని ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. చాలామంది 10-12 ఆసుపత్రులు తిరిగినా సరే... తమ వద్ద పడకలు లేవని తిప్పి పంపుతున్నారు. ఇక రోగికి వెంటిలేటర్‌ అవసరమైతే ముప్పు తిప్పలు పడాల్సిందే.

హైదరాబాద్‌లోని దాదాపు పేరున్న కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి. ప్రభుత్వ గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే 600 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 250 మంది ఐసీయూలో ఉన్నారు. ఇక్కడా వెంటిలేటర్ల కొరత ఉంది. ఐసీఎంఆర్‌ విధానాల నేపథ్యంలో చాలా ఆసుపత్రులు రోగులను హోం క్వారంటైన్‌ చికిత్సల వైపు ప్రోత్సహిస్తున్నాయి.

10 శాతం మందికే ఆస్పత్రి అవసరం

కొవిడ్‌ రోగుల్లో 60-80 మందిలో లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా తేలుతోంది. దీంతో కొందరు ప్రభుత్వ ఆసుపత్రులకు, మరికొందరు కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు. అక్కడ పడకలు లభించక నిరీక్షిస్తున్నారు. మరికొందరు ఇళ్లల్లో పెద్దలు, చిన్న పిల్లలు ఉండటంతో ఆసుపత్రి వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇంట్లో చిన్న ప్రత్యేక గది ఉండి... కొంచెం సౌకర్యంగా ఉన్నాసరే కొవిడ్‌ రోగులు ఆసుపత్రులకు రానక్కర లేదని వైద్యులు పేర్కొంటున్నారు. 10 శాతం మందికే ఆసుపత్రిలో చికిత్స అవసరమంటున్నారు. దీంతో ప్రభుత్వ, కార్పొరేట్‌ ఆసుపత్రులు ప్రత్యామ్నాయ బాట పడుతున్నాయి.

హోం క్వారంటైన్‌ చికిత్సలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకు ప్రత్యేక కిట్లు అందిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుర్వేద ఆసుపత్రిలో హోం క్వారంటైన్‌ రోగులకు ఉచితంగా వీటిని అందిస్తున్నారు. ప్రైవేటులో 7-14 రోజుల కోసం రూ.5-15 వేల వరకు ప్యాకేజీలను వివిధ ఆసుపత్రులు అందుబాటులోకి తెచ్చాయి.

హోం క్వారంటైన్‌లో చికిత్సలు ఇలా..

  • ప్రతి కొవిడ్‌ రోగిని తొలుత సంబంధిత వైద్యుడు ఆన్‌లైన్‌, లేదంటే నేరుగా పరిశీలిస్తారు. లక్షణాలు లేకపోతే హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తారు.
  • రోజు విడిచి రోజు వైద్యుడు వీడియో కన్సల్టేషన్‌లో రోగిని సంప్రదిస్తారు.
  • డైటీషియన్‌, ఫిజియోథెరపిస్టు, అవసరమైన సందర్భంలో మానసిక వైద్యుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటారు.
  • ఒక నర్సు నిత్యం వీడియో కన్సల్టేషన్‌లో రోగిని కనిపెట్టుకుని ఉంటుంది.
  • ప్యాకేజీలో చేరిన వెంటనే రోగికి ఒక కిట్‌ ఇస్తారు. ఇందులో పల్స్‌, ఆక్సిజన్‌ శాతం కొలిచే పరికరాలు,డిజిటల్‌ జ్వరమానిని, 2 ప్యాకెట్ల పేపర్‌ గ్లౌజులు, లీటరు హ్యాండ్‌ శానిటైజర్‌, డిస్‌ఇన్‌ఫెక్టర్‌(నేలను శుభ్రం చేసుకునేందుకు), 3 పొరలున్న 60 మాస్క్‌లు, చెత్తను పడేసే 10బ్యాగులు ఉంటాయి. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఔషధాలు వారే కొనుక్కోవాలి.
  • ఒకవేళ లక్షణాల తీవ్రత పెరిగితే వెంటనే వారిని సమీప ఆసుపత్రులకు తరలించేలా సూచనలు ఇస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకపోతే 14 రోజుల తర్వాత రోగి పూర్తిగా కోలుకున్నట్లే భావిస్తారు.

తీవ్రత ఉన్న రోగులకు పడకలు దొరకడం లేదు

కొవిడ్‌ ఉన్నంత మాత్రాన ఆసుపత్రులకు రానక్కర లేదు. దీనివల్ల వ్యాధి తీవ్రత ఉన్నవారికి పడకలు లభించడం లేదు. కరోనా వచ్చినా లక్షణాలు లేకుంటే ఆందోళన వద్ధు దీంతోపాటు సాధారణ జ్వరం, దగ్గు లాంటివి ఉన్నాసరే ఇంటి నుంచే చికిత్స పొందవచ్చు అన్ని ఆసుపత్రులు హోం క్వారంటైన్‌ ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చాయి. తీవ్రమైన జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు ఇతర సమస్యలు ఉంటేనే ఆసుపత్రుల్లో సంప్రదించాలి. ఇలాంటి వారు 10 శాతం వరకే ఉంటారు. ఇంట్లో చికిత్సకు అవకాశం ఉంటే అక్కడే ఉండటం మేలు. రోగులకు ఆర్థిక భారం తగ్గుతుంది. కొన్ని హోటళ్లలోను హోం క్వారంటైన్‌కు అనుమతి ఉంది.

- డాక్టర్‌ భాస్కరరావు, ఎండీ, సీఈవో, కిమ్స్‌ ఆసుపత్రులు

ఇదీ చదవండి: 1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.