ETV Bharat / state

మహిళా భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాం: హోంమంత్రి - హైదరాబాద్​ తాజా వార్తలు

తెలంగాణ సాధించుకున్న తర్వాత శాంతిభద్రతలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా భద్రతే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. పాతబస్తీ మీర్‌చౌక్‌లో భరోసా సెంటర్​కు భూమి పూజ చేశారు.

home minister mahmood ali put foundation stone for barosa center
మహిళా భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాం: హోంమంత్రి
author img

By

Published : Mar 21, 2021, 3:32 PM IST

హైదరాబాద్​ పాతబస్తీ మీర్‌చౌక్‌లో భరోసా సెంటర్​కు హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ భూమి పూజ చేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత శాంతిభద్రతలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా భద్రతే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. భరోసా సెంటర్ ఏర్పాటుతో మహిళల సమస్యలు త్వరగా తీరుతున్నాయన్నారు.

మహిళల కోసం షీ టీమ్స్‌ చాలా బాగా పనిచేస్తున్నాయని హోంమంత్రి ప్రశంసించారు. కోటి 8 లక్షలతో నగరంలోని జహీరానగర్‌లో రెండో భరోసా సెంటర్ ఏర్పాటు అవుతుందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు చాలా కృషి చేశారని ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవం ఉండాలని ఖురాన్ కూడా బోధిస్తుందని ఎంపీ వివరించారు.

ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. ఇలాంటి భరోసా సెంటర్ అవసరంలేని పరిస్థితులు రావాలని అసదుద్దీన్‌ అభిప్రాయపడ్డారు. కరోనా మరోసారి విజృంభిస్తుందని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. దేశంలో అత్యంత భద్రత కలిగిన సీటీ హైదరాబాద్‌ అని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. నగరంలో మహిళపై అఘాయిత్యాల సంఖ్య చాలా తక్కువని సీపీ పేర్కొన్నారు. మహిళ భద్రతే ధ్యేయంగా పనిచేస్తున్నామని అంజనీ‌కుమార్ వివరించారు.

ఇదీ చదవండి: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.