రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన భవనంలో విశాలమైన గదులు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని హోంమంత్రి తెలిపారు. కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'నన్ను అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధం'