మలక్‌పేట సర్కిల్ అజంపురలో డివిజన్‌లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా ప్రాముఖ్యమైనదని.. అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు.
బల్డియా ఎన్నికల్లో వందకుపైగా డివిజన్‌లు తెరాస కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని... ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.
ఇదీ చూడండి : గ్రేటర్‌లో ఓటేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు