లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఆసుపత్రులకు రాకపోకలు సాగిస్తున్న డయాలసిస్ రోగుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని హోంమంత్రి మహమూద్ అలీ... పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు సూచించారు. పాతబస్తీలోని మీర్‌చౌక్, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల్లో డయాలసిస్ చేయించుకోవాల్సిన వారిని పోలీసులు అడ్డుకోవడం వలన... డయాలసిస్ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నట్టు వ్యాధిగ్రస్తుల బంధువులు ఆందోళన చెందుతున్నారని హోంమంత్రి చెప్పారు.
ఆయా రోగులకు సంబంధించి అన్ని పత్రాలు పరిశీలించి ఆసుపత్రులకు అనుమతించేలా సిబ్బందిని ఆదేశించాలని అంజనీకుమార్‌కు హోంమంత్రి సూచించారు.
ఇవీ చూడండి:రక్తదానంతో మరొకరికి కొత్త జీవితం: మంత్రి ఎర్రబెల్లి