కరోనా వంటి కష్టకాలంలో రక్తదానం మంచి కార్యక్రమమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి.. రక్తదానం చేసిన వారిని అభినందించారు. అనంతరం వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ఆశావర్కర్లకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటించాలని మంత్రి సూచించారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని అన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.