ETV Bharat / state

రేపటి నుంచి రాష్ట్రంలో గ్రూప్‌-3 పరీక్షలు - అభ్యర్థులు ఈ జాగ్రత్తలు పాటించండి

రేపటి నుంచి 2 రోజుల పాటు గ్రూప్ -3 పరీక్షలు - అన్ని ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్సీ - ఒరిజినల్ ఐడీతో పరీక్షకు హాజరుకావాలని అధికారుల సూచన

General Instructions Group3 Exam Candidates
General Instructions Group3 Exam Candidates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

General Instructions Group3 Exam Candidates : రాష్ట్రంలో గ్రూప్‌-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం పరీక్ష 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తవుతుంది. అభ్యర్థులను ఉదయం 9.30 తరువాత పరీక్షాకేంద్రంలోనికి అనుమతించరు. మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తుంది. అభ్యర్థులను 2.30 గంటల తరువాత ఎగ్జామ్​ సెంటర్​లోకి పంపబోమని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు.

గ్రూప్​-3 అభ్యర్థులకు సూచనలు ఇవే : అభ్యర్థులు తమ వెంట బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, ఒరిజినల్ ఐడీ కార్డ్ తెచ్చుకోవాలని కమిషన్ సూచించింది. హాల్ టికెట్​పై తాజా పాస్​పోర్ట్ ఫోటోను అంటించుకొని తీసుకురావాలి. పాస్​పోర్ట్​ ఫోటో 3 నెలల కంటే పాతది కావొద్దని తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ కాపీని అభ్యర్థులు జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపింది. తొలిరోజు పరీక్షకు తీసుకొచ్చిన హాల్‌టికెట్‌ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని పేర్కొంది. ఫలితాలు వచ్చి, రిక్రూట్​మెంట్ పూర్తయ్యేవరకు ప్రశ్నపత్రాలు, హాల్‌టికెట్లను భద్రంగా పెట్టుకోవాలని కమిషన్‌ సూచించింది.

గ్రూప్‌-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్‌ - పరీక్షల షెడ్యూల్​ విడుదల

గ్రూప్​-3 ఎగ్జామ్​ షెడ్యూల్​ వచ్చేసింది - నవంబర్ 10 నుంచి హాల్​టికెట్ల డౌన్​లోడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.