మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు. పురాతన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివసించేవారు, లోతట్టు కాలనీవాసులు వెంటనే సమీప కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వం సిఫారసు చేసిన సురక్షిత కేంద్రంలో ఉండాలని కోరారు.
భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటికే పనిచేస్తోందని.. వీరితో పాటు పారామిలటరీని సిద్ధం చేసినట్లు మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు వరదలపై సహాయక కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని కిషన్రెడ్డి కోరారు.
ఇదీ చదవండి: భాగ్యనగరంలో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం