ETV Bharat / state

అమిత్‌షా రాష్ట్ర పర్యటన ఖరారు - పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు - తెలంగాణలో అమిత్‌షా పర్యటన ఖరారు

Home Minister Amit Shah Visit is Finalised in Telangana : కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 28న రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్‌, మహాబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌ క్లస్టర్ సమావేశాల్లో పాల్గొననున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం కోసం పార్టీ శ్రేణులకు అమిత్‌ షా దిశానిర్ధేశం చేయనున్నారు.

BJP Focus on Lok Sabha Elections 2024
Home Minister Amit Shah Visit is Finalised in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 9:59 PM IST

Home Minister Amit Shah Visit is Finalised in Telangana : రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ(BJP) కేంద్ర అధినాయకత్వం పావులు కదుపుతోంది. స్వయంగా కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా(Amit Shah) రంగంలోకి దిగారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు అమిత్‌ షా దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 28న రాష్ట్రానికి రానున్నారు.

'గ్రామీణ ప్రజలను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే భారత్ వికాస్ సంకల్ప యాత్ర లక్ష్యం'

కరీంనగర్‌, మహాబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌ క్లస్టర్ సమావేశాల్లో పాల్గొననున్నారు. కరీంనగర్‌, మహాబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌ క్లస్టర్ సమావేశాలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మండలాధ్యక్షుల స్థాయి నుంచి నేతల వరకు క్లస్టర్‌ సమావేశాలకు రావాలని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. 17 పార్లమెంట్‌ స్థానాలను ఐదు క్లస్టర్లుగా బీజేపీ విభజించింది. మూడు క్లస్టర్ సమావేశాలకు అమిత్‌ షా హాజరవుతుండగా మిగతా రెండు క్లస్టర్‌ సమావేశాలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) రానున్నారు. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటివారంలో జేపీ నడ్డా రాష్ట్రానికి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

రాముని అక్షింతల కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదు : బండి సంజయ్

BJP Focus on Lok Sabha Elections 2024 : మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ నాయకత్వం ఇంఛార్జీలను నియమించింది. ఇంఛార్జీలుగా 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ స్థానానికి ఇంఛార్జీగా గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇంకా ఆదిలాబాద్ - పాయక్ శంకర్, పెద్దపల్లి - రమారావు పాటిల్‌, కరీంనగర్ - ధనపాల్ సూర్యనారాయణ గుప్తాలను నియమించింది.

ఇంకా నిజామాబాద్ పార్లమెంట్‌ స్థానానికి ఏలేటి మహేశ్వరరెడ్డి, జహీరాబాద్ - కాటిపల్లి వెంకటరమణరెడ్డి, మెదక్ - పాల్వాయి హరీష్ బాబు, మల్కాజిగిరి- పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ - కే.లక్ష్మణ్, హైదరాబాద్ - రాజాసింగ్, చేవెళ్ళ - ఏవీఎన్ రెడ్డి, మహబూబ్‌నగర్ - రామచంద్రరావు, నాగర్‌కర్నూల్ - మాగం రంగారెడ్డి, నల్లగొండ - చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ - మర్రి శశిధరరెడ్డి, మహబూబాబాద్ - గరికపాటి మోహనరావు, ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డిలని నియమించింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్రయత్నాలు - లోక్​సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చు : బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.