హైదరాబాద్ ఎస్ఆర్నగర్లో హోంగార్డ్ బి.అలివేలు(43) ఆత్మహత్య చేసుకుంది. కుటుంబకలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మృతురాలు... బోరుబండలో నివాసం ఉంటుంది. భర్త రాము ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :సికింద్రాబాద్ నల్లగుట్టలో కిడ్నాప్ కలకలం