ETV Bharat / state

హెచ్‌ఎండీఏకు కాసుల వర్షం

author img

By

Published : Aug 28, 2020, 7:53 AM IST

అనధికార లేఅవుట్లు, నిర్మాణాలకు రిజిస్ట్రేషన్‌ చేయవద్దని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో హెచ్‌ఎండీఏకు కాసుల వర్షం కురవనుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో 4 వేల నుంచి 5 వేల వరకు లేఅవుట్లు, లక్షల్లో అనధికార నిర్మాణాలు ఉన్నాయని అధికారులే ఒప్పుకుంటున్నారు. ఒక్క నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 1100 వరకు అనధికార నిర్మాణాలుండటం గమనార్హం.

హెచ్‌ఎండీఏకు కాసుల వర్షం
హెచ్‌ఎండీఏకు కాసుల వర్షం

అనధికార లేఅవుట్లు, నిర్మాణాలకు రిజిస్ట్రేషన్‌ చేయవద్దని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో హెచ్‌ఎండీఏకు కాసుల వర్షం కురవనుంది. ప్రణాళికాపరమైన అభివృద్ధికి బాటలు పడనున్నాయి. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగనుంది. కూల్చివేతల తిప్పలు తప్పనున్నాయి. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు అప్పగించేందుకు రైతులు ముందుకొచ్చే అవకాశముందన్నది హెచ్‌ఎండీఏ అధికారుల అంచనా.

హెచ్‌ఎండీఏ పరిధిలో 4 వేల నుంచి 5 వేల వరకు లేఅవుట్లు, లక్షల్లో అనధికార నిర్మాణాలు ఉన్నాయని అధికారులే ఒప్పుకుంటున్నారు. ఒక్క నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 1100 వరకు అనధికార నిర్మాణాలుండటం గమనార్హం. కొత్త నిబంధనల ప్రకారం లేఅవుట్‌కు అనుమతి తీసుకుని అభివృద్ధి చేస్తే గజం కనీసం రూ.10 వేల వరకు విక్రయించాల్సి వస్తుంది. ఖాళీ స్థలం, ఉద్యానవనం, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తే లాభం ఉండదంటూ కొందరు స్థిరాస్తి వ్యాపారులు రాత్రికి రాత్రే వ్యవసాయ పొలాలు, చెరువు శిఖం, ప్రభుత్వ భూములను చదును చేసి గజం రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయించి పక్కకు తప్పుకుంటారు.

ల్యాండ్‌ పూలింగ్‌కు ఊతం..

భవిష్యత్తు అవసరాల కోసం చాలా మంది అభివృద్ధి చెందేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో స్థలాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి భూముల్ని సేకరించి సొంత నిధులతో లేఅవుట్లుగా అభివృద్ధి చేసి విక్రయించేందుకు ‘ల్యాండ్‌ పూలింగ్‌’కు శ్రీకారం చుట్టింది. పరిహారాన్ని పెంచినా రెండు, మూడు చోట్ల మినహా పెద్దగా స్పందన రాలేదు. కొత్త లేఅవుట్లకు సంబంధించి అప్రోచ్‌ రోడ్ల విషయంలో హెచ్‌ఎండీఏ కఠినంగా వ్యవహరిస్తోంది. తాజా ఆదేశాల నేపథ్యంలో చాలా మంది భూయజమానులు ముందుకొచ్చే అవకాశముంది. హైటెక్‌ సిటీ, కోకాపేట్‌ తదితర ప్రాంతాల్లోని హెచ్‌ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా లేఅవుట్లను అభివృద్ధి చేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

గ్రేటర్‌లో అక్రమ నిర్మాణాలకు చెక్‌!

జీహెచ్‌ఎంసీ ఏటా 13 వేల నిర్మాణ అనుమతులు జారీ చేస్తుంది. తాజా నిర్ణయంతో అపార్ట్‌మెంట్లలోని అదనపు అంతస్తులు, అక్రమ లేఅవుట్లలోని ఖాళీ స్థలాల్లో వెలిసే నిర్మాణాలు, ఇతరత్రా నిర్మాణాలకు చెక్‌ పడుతుంది. కొనుగోలు చేసేవారు వెనకడుగు వేస్తారని, తద్వారా నిర్మాణ అనుమతులకు దరఖాస్తులు పెరిగి ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రణాళిక విభాగం అంటోంది.

ఆదాయం వాళ్లకు.. పని మాకా..

అనధికార లేఅవుట్లు, నిర్మాణాలపై ఫిర్యాదు వచ్చిందంటే చాలూ.. హెచ్‌ఎండీఏలో కొందరు అధికారులకు పండగే. నోటీసుల పేరిట హడావుడి చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తే.. ఆ బాధ్యత మాది కాదు.. స్థానిక పంచాయతీలదేనంటూ తేల్చి చెబుతున్నారు. ఆదాయం వాళ్లకు.. పని మాకా అంటూ స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు.

ఇదీ చదవండి: 'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.