రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 25 వల్ల తమకు ఉద్యోగాలు రావని టీఆర్టీ హిందీ పండిట్ అభ్యర్థులు హైదరాబాద్‌లో ప్రగతిభవన్‌ను ముట్టడించారు. గత 50 ఏళ్లుగా విద్వాన్, ప్రవీణ, మాధ్యమ, విశారద సర్టిఫికెట్లతోనే నియామకాలు జరుగుతున్నాయని అన్నారు. దీంతో ముట్టడికి యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.
కొత్త జీవోతో తమ సర్టిఫికెట్లు చెల్లవంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి శిక్షణ తీసుకున్నామని...ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యమని అభ్యర్థులు వాపోయారు. మాకు అన్యాయం చేసి, మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు.