సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ఎన్వీ రమణ నియామకం కావడం తెలుగు వారికి ఎంతో గర్వకారణమని... హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసి... హిమాచల్‌ప్రదేశ్ సంప్రదాయమైన టోపి, శాలువాతో ఆయన్ను సన్మానించారు.
భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణను కలిశారు. భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని తెలుగు వ్యక్తి అధిరోహించడం ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు గర్వకారణమని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42 మందికి పెంచటం సంతోషకరమన్నారు.
ఇదీ చదవండి: Wuhan lab: కరోనాపై నోరువిప్పిన వైరాలజిస్ట్