మాజీమంత్రి దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. నాయిని నర్సింహా రెడ్డి కుటుంబంతో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని... ఎమర్జెన్సీ కాలంలో తనతో పాటు సుమారు 16 నెలలపాటు చంచల్గూడ జైలులో ఉన్నప్పుడు అహల్య నాయినిని తరచుగా కలిసే సందర్భాలలో... సోదరుడిగా భావించి తనను ఎంతో ఆత్మీయంగా పలకరించే వారని దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు.
నాయిని నర్సింహారెడ్డి మరణం నుంచి వారి కుటుంబం తేరుకుంటున్నలోపే ఆ ఇంట మరో విషాదం సంభవించడం... బాధాకరమన్నారు. ఆమె ఒక ఆదర్శ గృహిణి అని... వారి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ఈ కష్ట కాలంలో శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ అన్నారు.
ఇదీ చూడండి: నాయిని సతీమణి మృతి పట్ల ప్రముఖుల సంతాపం