ETV Bharat / state

జోరుగా తాగుతున్న మందుబాబులు.. రాష్ట్రానికి కోట్లలో ఆదాయం - రాష్ట్రంలో మద్యం అమ్మకాల తాజా వార్తలు

రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా వ్యాప్తి ఉన్నా.. చుక్క పడాల్సిందే అంటూ.. రోజుకు దాదాపు రూ.100 కోట్ల విలువైన లిక్కర్‌ను మందు బాబులు తాగేస్తున్నారు. 26 రోజుల్లో దాదాపు రూ.2,270 కోట్ల అమ్మకాలు జరిగితే... రూ.478 కోట్లతో... రంగారెడ్డి జిల్లా ముందువరుసలో నిలిచింది. అతి చిన్న జిల్లా అయిన ఆదిలాబాద్​లోనూ రూ.137 కోట్ల మద్యం అమ్ముడుపోయింది.

జోరుగా తాగుతున్న మందుబాబులు.. రాష్ట్రానికి కోట్లలో ఆదాయం

author img

By

Published : Jun 1, 2020, 12:29 PM IST

జోరుగా తాగుతున్న మందుబాబులు.. రాష్ట్రానికి కోట్లలో ఆదాయం

లాక్‌డౌన్‌ సమయంలోనూ రాష్ట్రంలో మందుబాబులు ఏ మాత్రం తగ్గడం లేదు. దుకాణాలకు సమయం కుదించినా... గిరాకీ మాత్రం తగ్గడంలేదు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా... మే 6న దుకాణాలు తెరవడం వల్ల మందుబాబులు బారులు తీరారు. ఇలా మే 6 నుంచి 31 వరకు.. 26 రోజుల్లో రూ.2,270 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.

వంద కోట్లకు మించి విక్రయాలు..

చాలా ఉమ్మడి జిల్లాల్లో రూ.100 కోట్లకు మించి విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.478 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. హైదరాబాద్‌లో రూ.225 కోట్లు, కరీంనగర్‌ జిల్లాలో రూ.206 కోట్లు, ఖమ్మం రూ.167 కోట్లు.. మహబూబ్‌నగర్‌ రూ.188 కోట్లు.. మెదక్‌ రూ.186 కోట్ల విలువైన లిక్కర్‌ను మందు బాబులు తాగేశారు. నల్గొండ జిల్లాలో రూ.251 కోట్లు, నిజామాబాద్‌ జిల్లాల్లో రూ.121 కోట్లు, వరంగల్‌ జిల్లాల్లో రూ.195 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయింది. చిన్న జిల్లా అయిన ఆదిలాబాద్‌లోనూ ఏకంగా రూ.137 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇక మే కంటే జూన్‌లో మద్యం అమ్మకాలు ఎక్కువ జరుగుతాయని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన 10 నెలల్లో జరిగే విక్రయాలను అంచనా వేసుకుంటే... దాదాపు రూ.30 వేల కోట్ల మద్యం అమ్మకాలు ఉంటాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు.

ఇవీ చూడండి: సోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.