కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకూ కొవిడ్ పరీక్షలు చేయాలన్న పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు జరపాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ పరీక్షలపై ప్రభుత్వ విధానంపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది.
మృతదేహాలకు కరోనా పరీక్షలపై నివేదికలో ప్రస్తావించలేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. జిల్లా కేంద్రాల్లో కొవిడ్ చికిత్స, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 26 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి: రెండోరోజు 'ఉద్దీపన'లపై కోటి ఆశలు