ETV Bharat / state

రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోండి: హైకోర్టు - హైదరాబాద్​ లేటెస్ట్​ వార్తలు

డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థుల కోసం ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించే అంశంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిర్ణయం తీసుకోకుంటే విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జరిమానా విధించటంతోపాటు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

highcourt hearing on icet special counseling
రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
author img

By

Published : Jan 18, 2021, 7:14 PM IST

డిగ్రీ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలంగాణ రిపబ్లికన్ పార్టీ దాఖలు చేసిన పిల్​పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అభిషేక్ రెడ్డిల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

ఎంబీఏ, ఎంసీఏలో మిగిలిన సీట్ల కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఈనెల 4న ప్రభుత్వానికి లేఖ రాసినట్లు హైకోర్టుకు ఉన్నత విద్యా మండలి నివేదించింది. లేఖ తమకు ఈనెల 8న అందిందని.. పరిశీలనలో ఉందని విద్యా శాఖ తరఫు న్యాయవాది తెలిపారు. లేఖ అంది పదిరోజులైనా నిర్ణయం తీసుకోలేరా అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని.. లేకపోతే విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: బయో ఆసియా సదస్సు పోస్టర్​ను ఆవిష్కరించిన కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.