High Court Stay on Teachers Promotions in Telangana : రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల పదోన్నతులపై ఈనెల 19 వరకు హైకోర్టు స్టే (High Court Stay on Teachers Promotions) విధించింది. రంగారెడ్డి జిల్లా ప్రాథమిక సీనియార్టీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు వేసిన పిటిషన్లపై.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లా కేటాయించారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.బాలకిషన్ రావు వాదించారు.
టీచర్ల బదిలీలపై ఏప్రిల్ 11 వరకు స్టే పొడిగించిన హైకోర్టు
Telangana Govt Teachers Promotion : జిల్లా కేడర్ సంఖ్యకు మించి టీచర్లను కేటాయించారని.. దానివల్ల స్థానిక ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని డి.బాలకిషన్ రావు హైకోర్టుకు తెలిపారు. ప్రాథమిక సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలకు తగిన సమయం ఇవ్వకుండానే పదోన్నతులకు సిద్ధమవుతున్నారని వివరించారు. అయితే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది సీనియార్టీ జాబితాను రూపొందిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది.. ధర్మాసనానికి విన్నవించారు. తుది సీనియారిటీ జాబితా ఇవ్వకుండా పదోన్నతులు ఇవ్వబోమని పేర్కొన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు ఈనెల 19 వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. పూర్తి వివరాలను సమర్పించాలని విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్య సంచాలకురాలు, రంగారెడ్డి జిల్లా డీఈవోలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. అప్పటి వరకు ప్రాథమిక సీనియార్టీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వొద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
High Court Permits Teachers Transfers in Telangana : ఇటీవలే ఉపాధ్యాయుల బదిలీలు(Teacher Transfers), పదోన్నతులకు మార్గం సుగమమైంది. బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు.. జీవోపై గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న టీచర్ దంపతులకు అదనపు పాయింట్లు ఇవ్వడానికి అనుమతినిచ్చింది యూనియన్ల ఆఫీస్ బేరర్లకు బదిలీల్లో ప్రాధాన్యమివ్వడాన్ని సమర్థనీయంగా కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. కావున యూనియన్ల నాయకులకు అదనంగా పది పాయింట్లను ఇవ్వకుండా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Teachers Transfers in Telangana : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం జనవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల్లో యూనియన్ నేతలకు, ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న టీచర్ దంపతులకు ప్రాధాన్యమిస్తూ.. వారి సర్వీసులకు అదనంగా పది పాయింట్లను కేటాయించింది. ఫిబ్రవరిలో వెబ్ కౌన్సెలింగ్లో బదిలీల కోసం 73,803 మంది టీచర్లు దరఖాస్తు చేస్తున్నారు. అయితే భార్యభర్తలు, యూనియన్ల నాయకులకు అదనపు పాయింట్లను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన ధర్మాసనం.. జీవోపై స్టే ఇస్తూ మార్చి 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో.. బదిలీలతో పాటు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది.
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే
Telangana High Court On Teacher Transfers : మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం వద్ద సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పీవీ కృష్ణయ్య, ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రామచంద్రరావు వాదించారు. నిబంధనల సవరణ చట్ట ప్రకారం జరగలేదని చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు.
నిబంధనల్లో మార్పులు జీవో ద్వారా చేయడానికి వీల్లేదని.. అసెంబ్లీ ఆమోదంతో గవర్నర్ చేయాలని న్యాయవాది కృష్ణయ్య హైకోర్టుకు తెలిపారు. భార్యభర్తల కేటగిరీ అమలు చేయాల్సి వస్తే ప్రైవేట్ ఉద్యోగులకూ అమలు చేయాలని వివరించారు. బదిలీలకు సంబంధించిన నిబంధనలు రూపొందించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. ఆగస్టు 5న అసెంబ్లీ ముందుంచామని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న టీచర్ల యూనియన్ల నేతలకు అదనపు పాయింట్ల కేటాయింపు సమర్థనీయంగా కనిపించడం లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
Teachers Transfer issue in Telangana : ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఆలస్యం.. అభ్యంతరాల పరిశీలన వేగవంతం!
Telangana Teachers Transfers : ఇరువైపుల వాదనలు విన్న టీచర్ల యూనియన్ల నేతలకు అదనపు పాయింట్ల కేటాయింపు సమర్థనీయంగా కనిపించడం లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి అనుమతినిచ్చిన న్యాయస్థానం.. భార్యభర్తలు కలిసి ఉండాలన్న ఉద్దేశంతో నిబంధన ఉందని తెలిపింది. టీచర్ల యూనియన్లకు అదనపు పాయింట్లను పక్కన పెట్టి బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే బదిలీలన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో సుమారు 30,000 మంది బదిలీలతో పాటు.. దాదాపు 9,000 మందికి పదోన్నతులు రానున్నాయి.
భార్యాభర్తలు ఒకే చోట పని చేసేలా బదిలీలకు డిమాండ్.. రణరంగంగా మారిన ఆందోళన..
TS teachers Transfers : సర్వీస్ సీనియారిటీకే సర్కార్ ప్రాధాన్యం.. వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు