ETV Bharat / state

'సచివాలయం కూల్చివేతకు పర్యావరణ అనుమతులేవి?' - high court latest hearings

సచివాలయం కూల్చివేత, నిర్మాణానికి ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరమేనని హైకోర్టు అభిప్రాయపడింది. భవనాలను కూల్చేందుకు జీహెచ్​ఎంసీ అనుమతి సరిపోతుందని ఏజీ వాదించగా.. ఇందుకు బలం చేకూర్చే తీర్పులు సమర్పించాలని సూచించింది. కేంద్రం కూడా ఈ విషయమై స్పష్టత ఇవ్వాలంది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్టు.. కూల్చివేత పనులపై స్టేను రేపటి వరకు పొడిగించింది.

high court
కూల్చివేతకు పర్యావరణ అనుమతులేవి: హైకోర్టు
author img

By

Published : Jul 15, 2020, 3:53 PM IST

సచివాలయం కూల్చివేతలు ఆపాలని కోరుతూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.

ఇంకా దరఖాస్తు చేయలేదు

సచివాలయం కూల్చివేతపై గత నెల 30 నాటి కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీల్డ్ కవర్​లో ధర్మాసనానికి సమర్పించింది. కూల్చివేతకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారన్నారు. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా అని హైకోర్టు ప్రశ్నించగా.. ఇంకా దరఖాస్తు చేయలేదని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. అయితే 20 వేల చదరపు మీటర్ల నుంచి లక్షన్నర మీటర్ల చదరపు మీటర్ల వరకు భారీ నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు అవసరమని నిబంధనలు చెబుతున్నాయని న్యాయస్థానం పేర్కొంది.

బలం చేకూర్చే కోర్టు తీర్పులున్నాయా?

నిర్మాణం కోసం భూమిని సిద్ధం చేయడానికి కూడా అనుమతి అవసరమని నిబంధనల్లో స్పష్టంగా ఉందని ధర్మాసనం తెలిపింది. కొత్త సచివాలయం కోసం ప్రస్తుత భవనాలను కూల్చివేయడం.. భారీ నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడమే కదా అని హైకోర్టు ప్రశ్నించింది. కూల్చివేతకు ముందస్తుగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని.. నిర్మాణం చేపట్టేటప్పుడు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ వాదించారు. కూల్చివేత కోసం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ముందస్తు అనుమతులు అవసరం లేదనకుంటే.. ముందుగా వందల చెట్లు, చారిత్రక కట్టడాలను తొలగించి.. ఆ తర్వాత పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేస్తారని.. అలా చేస్తే పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు అర్థమే ఉండదని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూర్చే కోర్టు తీర్పులు ఉంటే సమర్పించాలని ఏజీని ఉన్నత న్యాయస్థానం అడిగింది. రేపటి వరకు సమయం ఇస్తే ఆధారాలు, తీర్పులు సమర్పిస్తామని ఏజీ కోరడం వల్ల హైకోర్టు అందుకు అంగీకరించింది.

నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడం అంటే ఏమిటనే విషయంపై కేంద్ర పర్యావరణ శాఖను అడిగి స్పష్టత ఇవ్వాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్​ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు... అప్పటి వరకు కూల్చివేత పనులు చేపట్టవద్దంటూ స్టే పొడిగించింది.

కూల్చివేతకు పర్యావరణ అనుమతులేవి: హైకోర్టు

ఇదీ చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.