ETV Bharat / state

ఉయ్యాలవాడ కుటుంబసభ్యులకు హైకోర్టులో చుక్కెదురు

సైరా నరసింహారెడ్డి సినిమాపై వివాదం కొనసాగుతోంది. చిత్రానికి సెన్సార్​ అనుమతి నిలిపివేయాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించగా... పిటిషన్​లో ప్రతివాదిగా అమితాబ్​ను ఎందుకు పేర్కొన్నారని ధర్మాసనం ప్రశ్నించింది.

HIGH COURT SERIOUS ON UYYALAVADA FAMILY ABOUT SYRAA MOVIE PETITION
author img

By

Published : Sep 25, 2019, 4:48 PM IST

Updated : Sep 25, 2019, 4:54 PM IST

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'సైరా' సినిమాపై ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వారసులు దాఖలు చేసిన పిటిషన్​లో అమితాబ్ బచ్చన్​ను ప్రతివాదిగా చేర్చటంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషన్​లో అమితాబ్​పై ఎలాంటి ఆరోపణలు, అంశాలు లేకపోయినప్పటికీ... ప్రతివాదిగా ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నించింది. అమితాబ్ పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగించి పిటిషన్​ను సవరించాలని సూచించింది. సైరా సినిమాకు సెన్సార్ అనుమతి నిలిపివేయాలని కోరుతూ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వారసులు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పబ్లిక్ డొమెయిన్​లో ఉన్న అంశాలపై ఎవరికీ యాజమాన్య హక్కులు ఉండవని నిర్మాత తరఫు న్యాయవాది వాదించగా... తదుపరి విచారణ రేపు జరగనుంది.

ఉయ్యాలవాడ కుటుంబసభ్యులకు హైకోర్టులో చుక్కెదురు

ఇవీ చూడండి: వేణుమాధవ్ సినిమాలకు ఎందుకు దూరమయ్యాడో తెలుసా..!

Intro:Body:Conclusion:
Last Updated : Sep 25, 2019, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.