ETV Bharat / state

TELANGANA HC: 'అణాపైసలకే భూ కేటాయింపులా? ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే'

‘‘సర్కారు భూములకు ధర్మకర్తగా ఉండాల్సిన మీరు ఎలాంటి షరతుల్లేకుండా అణాపైసలకే భూములను కేటాయించి... ఇప్పుడు వాటిని ఉపయోగించుకోవడంలేదని స్వాధీనం చేసుకుంటామంటే ఎలా? నిర్దిష్ట గడువులోగా వినియోగించుకోవాలని మొదట్లోనే ఎందుకు షరతు పెట్టలేదు? ఇది ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే. ఇప్పుడు షరతులు విధించడానికి మీరెవరు’’ అని శుక్రవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

high-court
అణాపైసలకే భూ కేటాయింపులా?
author img

By

Published : Aug 14, 2021, 8:38 AM IST

2001లో ఆనంద్‌ సినీ సర్వీసెస్‌కు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కేటాయించిన 5ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ చేసివ్వాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది పి.రాధీవ్‌రెడ్డి వాదనలు వినిపించారు.

‘‘ఆ సంస్థకు 2001లో 5 ఎకరాలు కేటాయించాం. ఇందులో 1.7 ఎకరాలను వినియోగించుకుంటోంది. మిగిలిన 3.31 ఎకరాలను స్వాధీనం చేసుకుంటూ సీసీఎల్‌ఏ 2014లో ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని సవాలు చేస్తూ ఆనంద్‌ సినీ సర్వీసెస్‌ హైకోర్టును ఆశ్రయించింది. పూర్తి వివరాలను పరిశీలించకుండా సింగిల్‌ జడ్జి భూమిని రిజిస్ట్రేషన్‌ చేసివ్వాలని ఆదేశించారు. అప్పట్లో చదరపు గజం రూ.1.75కే కేటాయించాం’’ అని వివరించారు.

అప్పుడేం చేశారు..

ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘‘అది మీ తప్పు. అణాపైసలకే భూములను కేటాయిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించింది. సర్కారు భూములకు ధర్మకర్తగా ఉండాల్సిన మీరే.. ఎలాంటి షరతుల్లేకుండా అణాపైసలకే భూములను కేటాయించి... ఇప్పుడు వాటిని ఉపయోగించుకోవడం లేదని స్వాధీనం చేసుకుంటామంటే ఎలా అంటూ ప్రశ్నించింది. నిర్దిష్ట గడువులోగా వినియోగించుకోవాలని మొదట్లో ఎందుకు షరుతు పెట్టలేదని అడిగింది. వినియోగించుకోని భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ ప్రభుత్వం కొత్త విధానం తెచ్చిందని న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబరు 24కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'గాలి' బళ్లారిలో ఉంటే సాక్షులకు ముప్పు

'ప్రజల ప్రవర్తనతోనే థర్డ్​వేవ్​ ముప్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.