ETV Bharat / state

తేలిగ్గా తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం: హైకోర్టు - telangana varthalu

ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను గౌరవించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాల ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటే.. తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆరు నెలల పాటు అనాథాశ్రమంలో సేవ చేయాలని నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్​ను హైకోర్టు ఆదేశించింది. సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డిపై ఇప్పటి వరకు దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలన్నీ తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

high court
తేలిగ్గా తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం: హైకోర్టు
author img

By

Published : Apr 7, 2021, 8:46 PM IST

ప్రభుత్వ అధికారుల కోర్టు ధిక్కరణ చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కోర్టు ఆదేశాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ శిక్ష పడితే.. అప్పీల్ చేస్తే సరిపోతుందని భావిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది. కోర్టు ధిక్కరణ కేసులకే ఇద్దరు ముగ్గురు జడ్జీలను పెట్టాల్సి వచ్చేలా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆదేశాలను అధికారులు తేలిగ్గా తీసుకుంటే.. కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.

సామాజిక సేవ చేయాలి...

సామాజిక సేవ చేయాలని నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్​ను హైకోర్టు ఆదేశించింది. రైస్​మిల్లుకు ధాన్యం సరఫరా చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయనందుకు ప్రశాంత్ జీవన్ పాటిల్, అప్పటి జిల్లా పౌర సరఫరాల అధికారి సంధ్యారాణికి సింగిల్ జడ్జి 2 వేల రూపాయల జరిమానా విధించారు. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ పాటిల్, సంధ్యారాణి దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. సామాజిక సేవ చేస్తే కోర్టు ధిక్కరణ శిక్ష రద్దు చేస్తామని గత విచారణలో హైకోర్టు ప్రతిపాదించింది. విచారణకు హాజరైన కలెక్టర్ .. ఓ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 6వేల మంది బాలికలను చేర్పించినట్టు తెలిపారు. అది కలెక్టర్‌గా బాధ్యతే కానీ... వ్యక్తిగత సామాజిక సేవ ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. నల్గొండలోని అనాథాశ్రమంలో వారానికి 2 గంటల పాటు ఆరు నెలలు సేవ చేయాలని కలెక్టర్​ను ఆదేశించింది. సేవ చేసినట్లు జిల్లా న్యాయమూర్తితో ధ్రువీకరణ పత్రం తీసుకొని రావాలని స్పష్టంచేసింది.

పిల్లలకు భోజనం పెట్టాలి..

హైదరాబాద్​లోని ఏదైనా అనాథాశ్రమంలో రానున్న ఉగాది, శ్రీరామనవమి రోజున పిల్లలకు భోజనం పెట్టాలని విశ్రాంత పౌర సరఫరాల జిల్లా అధికారి సంధ్యారాణిని హైకోర్టు ఆదేశించింది. మరో కేసులో సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో, తహసీల్దార్​పై ఇప్పటి వరకు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుల వివరాలన్నీ తమ ముందుంచాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి: ఆరు నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.