ETV Bharat / state

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ జీవోలపై వివరణ ఇవ్వండి: హైకోర్టు - హైదరాబాద్ తాజా వార్తలు

high court: ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవోలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. క్రమబద్ధీకరణ కోసం 2014లో జారీ చేసిన జీవో 59తో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన జీవో 14పై కూడా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Jul 21, 2022, 3:49 AM IST

high court: ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవోలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. క్రమబద్ధీకరణ కోసం 2014లో జారీ చేసిన జీవో 59తో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన జీవో 14పై కూడా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఆక్రమణలో ఉన్న 250 చదరపు గజాల వరకు ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించాలని 2014లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మాజీ ప్రొఫెసర్‌ అన్వర్‌ ఖాన్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌.నంద ధర్మాసనం వద్ద ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. నామ మాత్రపు ధరలతో క్రమబద్ధీకరించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదించారు.

హైకోర్టు గతంలోనే ఆదేశించినప్పటికీ ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయలేదన్నారు. కేసు కొనసాగుతుండగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో జీవో కూడా ఇచ్చారన్నారు. పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం.. రెండు జీవోలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.

ఇవీ చదవండి: Kishanreddy on TRS: ఆ విషయంలో తెరాస తప్పుదోవ పట్టిస్తోంది: కిషన్‌రెడ్డి

'రోజూ ఇవి ఎలా తినగలం సారూ?'.. మాడిన రొట్టెలపై కోర్టులో ఖైదీ ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.