రాయలసీమ ఎత్తిపోతల పథకంపై హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత వంశీచందర్‌రెడ్డి, శ్రీనివాస్ పిల్‌పై హైకోర్టులో విచారణ చేపట్టారు. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచన చేసింది.
రాష్ట్ర పునర్విభజన చట్టం పరిధిలో విచారణ జరపాలని పిటిషనర్ల న్యాయవాది కోరారు. రెండు రాష్ట్రాల జలవివాదం హైకోర్టు పరిధిలోకి ఎలా వస్తుందని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్లతో చర్చించి చెబుతామని న్యాయవాది శ్రవణ్ తెలిపారు. తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.