ETV Bharat / state

డిగ్రీలో నేరుగా ప్రవేశాలకు హైకోర్టు అనుమతి

'దోస్త్'​ ద్వారా కాకుండా నేరుగా ప్రవేశాలు చేపట్టేందుకు పలు డిగ్రీ కళాశాలలకు ఈ ఏడాది కూడా హైకోర్టు అనుమతించింది. తుది తీర్పుకు లోబడే ప్రవేశాలు ఉండాలని స్పష్టం చేసింది.  న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కాలేజీలను 'దోస్త్'​ లో చేర్చవద్దంటూ ఉన్నత విద్యామండలిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.

హైకోర్టు
author img

By

Published : May 21, 2019, 9:34 AM IST

డిగ్రీలో నేరుగా ప్రవేశాలకు హైకోర్టు అనుమతి

ఈ ఏడాది కూడా డిగ్రీ కళాశాలల్లో నేరుగా ప్రవేశాలకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. దోస్త్​ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా​ అడ్మిషన్​ కల్పించేందుకు పలు కళాశాలకు అవకాశం ఇచ్చింది. తుది తీర్పుకు లోబడే ప్రవేశాలు ఉండాలని... ఆ విషయాన్ని విద్యార్థులకు వివరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. దోస్త్ ద్వారా 2019-20 విద్యా సంవత్సరానికి ఆన్​లైన్ ప్రవేశాలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి ఈ నెల 5న ప్రకటన జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని పలు కాలేజీలు హైకోర్టులో సవాల్ చేశాయి. ​గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉండగానే.. ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసిందని ఆరోపించాయి. ఆన్​లైన్ ప్రవేశాలు చట్ట విరుద్ధమని వాదించాయి.

ఇప్పటికే అంగీకరించాయి

ఇప్పటికే సుమారు 1,200 కళాశాలు ఆన్​లైన్ ప్రవేశాలకు అంగీకరించాయని.. కొన్ని కాలేజీలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని ఉన్నత విద్యా మండలి తరఫు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం... కోర్టును ఆశ్రయించిన పలు కాలేజీలను దోస్త్​లో చేర్చవద్దంటూ ఉన్నత విద్యామండలిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఇవీ చూడండి: 'దుమ్ముగూడెం ఎత్తు పెంపు సీతారామ ఎత్తిపోతలకోసమే'

సికింద్రాబాద్.. యాంకర్. తిరుమలగిరి పి.ఎస్ పరిధిలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఆకస్మిక మరణం వారి కుటుంబ సభ్యులకు అతని మరణం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ నెల 19 రోజు గంగయ్య బస్తీ ఆర్టీసీ్ కాలనీ ఇంటి నెంబర్ ఎఫ్ ఎఫ్ 35 లో నివాసం ఉండే దంతూరు శ్రీనివాస్ తండ్రి లేట్ వెంకటయ్య , వయసు 32 సంవత్సరాలు అనే వ్యక్తి రాత్రి మద్యం తాగి 11 గంటల సమయంలో లో భోజనం చేసి పడుకొన్నాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో లో ఆయాసం వచ్చి అకస్మాత్తుగా మరణించడం జరిగింది .ఈయనకు మద్యం అలవాటు బాగా ఉందని పోలీసులు తెలిపారు. గతంలో లో పది సంవత్సరాల క్రితం నుండి ఎడమవైపు చేతిలో ఎద్దు పొడవుగా చాతి నొప్పి వస్తూ ఉండేదని అన్నారు..అది తగ్గడానికి మద్యం సేవిస్తూ ఉండేవాడని తెలిపారు.. దీంతో రాత్రి 2 గంటల సమయంలో లో ఆయాసం వచ్చి, ఆకస్మికంగా మరణించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీ కి తరలించడం జరిగింది. మృతుని అక్క మనెమ్మ పిర్యాదు మేరకు తిరుమలగిరి పోలీస్ వారు అనుమానాస్పద మరణం గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. తిరుమలగిరి ఇన్స్పెక్టర్ రవి కుమార్ పర్యవేక్షణలో ఎస్.ఐ వెంకటేశ్వర్లు చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.