High Court permission for Congress party to Dharna: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ.. గ్రామ పంచాయతీ నిధుల గురించి ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడి వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు వెలువరించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు అనుమతి నిరాకరించడాన్ని టీపీసీసీ సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై లంచ్ మోషన్లో విచారణను స్వీకరించిన ధర్మాసనం.. తీర్పును వెలువరించింది.
గ్రామ పంచాయతీలకు నిధులపై తలపెట్టిన ధర్నాకు అనుమతిని మంజూరు చేస్తూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధర్నాచౌక్ వద్ద ధర్నాకు సంబంధించిన కొత్త తేదీలతో దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీకి తెలిపింది. ఈ ధర్నాలో పాల్గొనే వారు 300 మందికి మించి ఉండరాదని హైకోర్టు స్పష్టం చేసింది.
అసలేం జరిగింది: ఈనెల 2వ తేదీన గ్రామ పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధర్నాచౌక్ వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలను ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి.. బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ధర్నాచౌక్ వద్ద ధర్నాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై టీపీసీసీ ప్రధాన కార్యనిర్వాహక అధ్యక్షుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు పచ్చజెండా ఊపింది.
ఇవీ చదవండి: