ETV Bharat / state

ఒంటెలను చంపకుండా చర్యలు తీసుకోండి: హైకోర్టు - హైకోర్టు తాజా వార్తలు

ఒంటెలను చంపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మాంసం దుకాణాలు, వధశాలలు తనిఖీ చేయాలని తెలిపింది. ఒంటెల మాంసం విక్రయం నేరమని ప్రచారం చేయాలని సూచించింది.

High Court order to telangana government take action not to kill camels
ఒంటెలను చంపకుండా చర్యలు తీసుకోండి: హైకోర్టు
author img

By

Published : Jul 17, 2020, 5:31 PM IST

ఒంటెలను అక్రమ వధ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒంటెల అక్రమ రవాణా, మాంసం విక్రయం నేరమని విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొంది. ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరింది. ఈనెల 29లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

ఒంటెల అక్రమ రవాణా, వధ అడ్డుకోవాలన్న డాక్టర్ శశికళ పిల్​పై హైకోర్టులో విచారణ జరిగింది. బక్రీద్ సందర్భంగా ఒంటెలను చంపే ప్రమాదముందని పిటిషనర్ వాదించారు. ఒంటెల వధను నిరోధించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు.

ఇదీ చూడండి : సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు పచ్చ జెండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.