Government Lands Allocations in Telangana : రాష్ట్రంలో కులాల వారీగా భూములు కేటాయించడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధంగా ఉందని మండిపడింది. ప్రభుత్వ తీరు సమాజంలో కుల విభజనకు దారితీసేలా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇరుకైన ఆలోచనలు వీడి.. విశాలంగా ఆలోచించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లోని ఖానామెట్‌లో వెలమ, కమ్మ సంఘాలకు భూముల కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. వెలమ, కమ్మ సంఘాలకు 2021లో ప్రభుత్వం 5 ఎకరాలను ఉచితంగా కేటాయించింది. దీనిపై కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి వేసిన పిల్‌పై సీజే మరోసారి విచారణ చేపట్టారు.
High Court Serious On Castewise Land Allocations : హైటెక్ రాష్ట్రంలో 21వ శతాబ్దిలోనూ ఇదేమి విధానమని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కులాల వారీగా భూ కేటాయింపులు కచ్చితంగా తప్పేనని.. అసంబద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలకు మాత్రమే ప్రభుత్వం స్థలాలు ఇవ్వొచ్చునన్నది. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం వంటి విధానాలు అవసరమని హైకోర్టు తెలిపింది. దేశంలో అనేక కుల సంఘాలు సామాజిక కార్యక్రమాల కోసం భూములు కొన్నాయని.. కులాల వారీగా భూములను ఎక్కడా కేటాయించలేదని పేర్కొంది. విద్య, వైద్యం వంటి సేవల కోసం భూములు కేటాయిస్తే అర్థం చేసుకోవచ్చు కానీ.. కుల సంఘాల కార్యక్రమాల కోసం ఇవ్వడమేంటని ప్రశ్నించింది. కౌంటరు దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని వెలమ సంఘం తరఫు న్యాయవాది కోరారు. కౌంటరు వేయాలని నోటీసు ఇచ్చినప్పటికీ... స్పందించనందున కమ్మ సంఘం తరఫు వాదనలు వినకుండా విచారణ జరపనున్నట్లు హైకోర్టు తెలిపింది. పిల్‌పై తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
శారదా పీఠం, జీయర్ వేదిక్ అకాడమీకు హైకోర్టు నోటీసులు : భూముల కేటాయింపుపై దాఖలైన పిటిషన్లపై స్పందన తెలపాలని విశాఖ శారద పీఠం, జీయర్ వేదిక్ అకాడమీకి హైకోర్టుకు నోటీసులు జారీ చేసింది. చిన్న జీయర్ స్వామికి చెందిన జీయర్ సమీకృత వేదిక్ అకాడమీకి యాదాద్రి ఆలయం సమీపంలోని గుండ్లపల్లిలో 2 ఎకరాల 30 గుంటలను 2019లో ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా విశాఖ శారదపీఠానికి కోకాపేటలో రెండు ఎకరాలు ఇచ్చింది. కోట్ల రూపాయల విలువైన భూములను ఎకరానికి కేవలం రూపాయి చొప్పున కేటాయిండం రాజ్యాంగ విరుద్ధమంటూ సికింద్రాబాద్ నివాసి వీరాచారి 2019లో పిల్ వేశారు.
High Court On Saradha And Geyar Land Case : ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం వద్ద ప్రజా ప్రజాయోజన వ్యాజ్యం ఇవాళ మరోసారి విచారణ జరిగింది. వేద పాఠశాలు, విద్యార్థుల కోసం ఆశ్రమం కోసం కేటాయించినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భూమిని కేటాయించే అధికారం మంత్రిమండలికి ఉందని వాదించారు. వేదాలను, సంప్రదాయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కౌంటర్లు దాఖలు చేయాలని విశాఖ శారద పీఠం, జీయర్ అకాడమీకి మరోసారి నోటీసులు జారీ చేసింది. విశాఖ శారద పీఠానికి భూకేటాయింపుపై జులై 24కి.. జీయర్ అకాడమీకి కేటాయింపులపై ఆగస్టు 1కి విచారణ వాయిదా వేసింది.
700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల.. వసతులపై హైకోర్టు అసంతృప్తి
ఇవీ చదవండి :