ETV Bharat / state

దివ్యాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించే ఉద్దేశం ఉందా?: హైకోర్టు - high court of telangana

దివ్యాంగుల సంక్షేమం కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించే ఉద్దేశం ఉందో లేదో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దివ్యాంగులను ఆదుకోవాలని కోరుతూ శివ గణేష్ కర్నాటి దాఖలు చేసిన పిల్​పై న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రత్యేక నిధి ఏర్పాటు అంశంపై నిర్ణయం చెప్పాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.

high court on disabled fund
దివ్యాంగుల సంక్షేమం కోసం నిధులు కేటాయించే ఉద్దేశం ఉందా?: హైకోర్టు
author img

By

Published : Jun 20, 2020, 4:57 PM IST

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న దివ్యాంగుల సంక్షేమం కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించే ఉద్దేశం ఉందో లేదో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జిల్లాల వారీగా నిధులను జనాభాకు అనుగుణంగా పెంచాలని కోరింది. లాక్​డౌన్​లో దివ్యాంగులను ఆదుకోవాలని కోరుతూ శివ గణేష్ కర్నాటి దాఖలు చేసిన పిల్​పై హైకోర్టు విచారణ జరిపింది. అత్యవసరాల కోసం 10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.శైలజ ప్రభుత్వాన్ని కోరారని ఏజీ బీఎస్​ ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక నిధి ఏర్పాటుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి , రంగారెడ్డి జిల్లాలకు 5 లక్షల రూపాయల చొప్పున.. మిగతా జిల్లాలకు కేవలం లక్ష చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్​కుమార్ తెలిపారు. వరంగల్ వంటి పెద్ద జిల్లాలకు ఆ సొమ్ము సరిపోదన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉండగా.. రెండు నెలలుగా నాన్చుతోందని , ప్రత్యేక నిధి ఏర్పాటుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్​జెండర్ వంటి వర్గాలను ప్రత్యేక దృష్టితో చూడాలని హైకోర్టు పేర్కొంది. ప్రత్యేక నిధి ఏర్పాటు అంశంపై నిర్ణయం చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది .

ఇవీ చూడండి: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు: నారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.