జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఓటర్ల జాబితాను మళ్లీ తాజాగా సిద్ధం చేయాలని హైకోర్టు ఆదేశించింది. రెండు నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని.. కొందరు అర్హులకు ఓటు హక్కు రాలేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. అర్హులైన ఓటర్లతో కొత్త జాబితా తయారు చేసి ప్రచురించాలని.. ఆ తర్వాత రెండు వారాలు అభ్యంతరాలు స్వీకరించాలని స్పష్టం చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని తీర్పునిచ్చింది.
ఇదీ చదవండి: యువతి కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకల ముద్ద..!