ETV Bharat / state

ఎస్‌ఈసీ ఆర్డినెన్స్‌, జీవోలపై 28న తుది విచారణ - ఏపీ ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపుపై హైకోర్టులో విచారణ

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని కుదిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై... ఈ నెల 28న తుది విచారణ జరగనుంది. ఏపీ ప్రభుత్వంతో పాటు నూతన ఎస్​ఈసీ జస్టిస్‌ కనగరాజ్‌..24వ తేదీ లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లపై... 27వ తేదీ నాటికి పిటిషనర్లు ప్రతి సమాధానాలు సమర్పించాలని సూచించింది.

court
ఎస్‌ఈసీ’ ఆర్డినెన్స్‌, జీవోలపై 28న తుది విచారణ
author img

By

Published : Apr 21, 2020, 8:54 AM IST

ఏపీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నియామకం, పదవీకాలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌, జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన 12 వ్యాజ్యాలపై విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. వ్యాజ్యాలన్నింటిలో 24 తేదీ లోపు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కొత్త ఎస్‌ఈసీగా నియమితులైన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.కనగరాజ్‌ కూడా 24వ తేదీలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంది. ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లపై... 27వ తేదీ నాటికి పిటిషనర్లు ప్రతి సమాధానాలు సమర్పించాలని సూచించింది. ఈనెల 28న వ్యాజ్యాలపై తుది విచారణ జరుపుతామని వెల్లడించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపి ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

పదవీకాలం ముగియకముందే తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి వేర్వేరుగా మరో 11 వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. వీటిపై సోమవారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదిస్తూ... కొన్ని వ్యాజ్యాల్లో ప్రాథమిక కౌంటర్‌ మాత్రమే దాఖలు చేశామని, తుది కౌంటర్‌ దాఖలు చేయడానికి వారం గడువు కావాలని కోరారు. ఈ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. తుది కౌంటర్‌ దాఖలు పేరుతో గడువు కోరడం సరికాదంది. కొత్త ఎస్‌ఈసీ జస్టిస్‌ కనగరాజ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ... కౌంటర్‌ వేయడానికి మూడు వారాల గడువు కావాలన్నారు. అందుకు నిరాకరించిన ధర్మాసనం ఈనెల 24 నాటికి కౌంటర్‌ వేయాలని స్పష్టం చేసింది. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదిస్తూ... కొత్త ఎస్‌ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ... స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ఈనెలాఖరు వరకు ఎస్‌ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేరని పేర్కొంది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

ఇదీ చదవండి: తలసేమియా రోగులకు రక్తమార్పిడి చేస్తేనే బతుకుతారు: మంత్రి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.