అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆక్రమణల కూల్చివేతకు సంబంధించిన పిటిషన్‌లపై విచారణకు ప్రాధాన్యమిస్తామని కోర్టు.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు అక్రమ నిర్మాణలపై దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్‌లపై ధర్మాసనం విచారణ చేపట్టింది.
క్రమబద్ధీకరణకు 1.10 లక్షల దరఖాస్తులు
ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అక్రమ నిర్మాణాలపై ఎన్ని పిటిషన్లు వచ్చాయి? ప్రజా ప్రయోజన పిటిషన్‌లు ఎన్ని ఉన్నాయి? వంటి వివరాలు సమర్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. క్రమబద్ధీకరణకు 1.10 లక్షల దరఖాస్తులందాయని, అక్రమ నిర్మాణాలపై 10,600 ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ కోర్టుకు తెలిపారు.
అక్రమ నిర్మాణాలపై వేటు తప్పదు...
పదివేల అక్రమ నిర్మాణాల్లో 3,400 నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. 2,200 భవనాల యజమానులు సివిల్ కోర్టులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. 2,400 నిర్మాణాల యజమానులు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందినట్లు తెలిపారు. 900 తప్పుడు ఫిర్యాదులు అందాయన్నారు. ఏప్రిల్ 23 నాటికల్లా మతపరమైన నిర్మాణాల నివేదికను సమర్పిస్తామని తెలిపారు.
కోర్టు ఉత్తర్వుల మాటున అక్రమనిర్మాణాలను కొనసాగించడానికి అనుమతించలేమని, స్పెషల్ డ్రైవ్‌గా ఈ కేసుల విచారణ చేపడతామని తెలిపింది. అనంతరం ఏప్రిల్ 24కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: మహిళా అభిమానులూ నా భార్యతో జాగ్రత్త