పిటిషనర్లే నిజాంలాగా భావించుకొని వాదించొద్దని ఎర్రమంజిల్ భవనం కూల్చివేత కేసు విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయల అప్పులున్నాయని పిటిషనర్ వాదించగా... అప్పులున్నాయని అభివృద్ధి పనులు ఆపమని చెప్పగలమా? అని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మంత్రిమండలి నిర్ణయంలో చట్టపరమైన లోపం ఏంటో వివరించాలని ధర్మాసనం... పిటిషనర్‌ను ఆదేశించింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇవీ చూడండి:'లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించండి'