ETV Bharat / state

రాష్ట్ర విత్తనాలు ప్రపంచ దేశాలకు ఆధారం కావాలి - HYDERABAD

తెలంగాణలో విత్తనాల పంట పండాలి... నాణ్యమైన, రసాయన అవశేషాల్లేని విత్తనం ప్రపంచ దేశాలకు ఆధారం కావాలని ప్రభుత్వం, పరిశోధన సంస్థలు దిశానిర్దేశం చేశాయి. సాంప్రదాయ వ్యవసాయం నుండి రైతులు బయటకొచ్చి పంట‌ల వైవిద్యీక‌ర‌ణ, అనుబంధ ఉద్యాన వనం, పాడి, మత్స్య, కోళ్ల పెంపకం చేపట్టడం ద్వారా లాభాలు సొంతం చేసుకోవాలని నిపుణులు సూచించారు. హెచ్‌ఐసీసీ ఇస్టా సదస్సులో భాగంగా విత్తనోత్పత్తి రైతుల సమావేశం విజయవంతమైంది.

రాష్ట్ర విత్తనాలు ప్రపంచ దేశాలకు ఆధారం
author img

By

Published : Jun 28, 2019, 5:08 AM IST

Updated : Jun 28, 2019, 1:23 PM IST

రాష్ట్ర విత్తనాలు ప్రపంచ దేశాలకు ఆధారం

విత్తనోత్పత్తిదారుల సమావేశంలో కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్‌ మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ విత్తన పరీక్షా సంఘం - ఇస్టా సదస్సు అమూల్యమైన చర్చలకు వేదికైంది. ఇస్టా సదస్సులో భాగంగా విత్తనోత్పత్తిదారుల సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ప్రత్యేకించి విత్తనోత్పత్తిదారుల కోసమే ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి 1600 మంది రైతులు హాజరయ్యారు. ప్రధాన ఆహార పంట వరి సహా మొక్కజొన్న, జొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూర వంటి పంటల నాణ్యమైన విత్తనోత్పత్తిలో అవలంభించాల్సిన పద్ధతులపై నిపుణులు రైతులకు చక్కటి అవగాహన కల్పించారు. విత్తనోత్పత్తిలో జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత, మొలక శాతం, విత్తన ఓజస్సు, ఏకరూపత రంగు, తేమ శాతం, మొలక సాధ్యత, ఏకరూపత పరిమాణం, ధీర్ఘాయువు లాంటి లక్షణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.

విత్తనాల ఉత్పత్తికి ప్రపంచంలోనే శ్రేష్ఠమైన ప్రాంతం
విత్తనాల ఉత్పత్తికి ప్రపంచంలోనే తెలంగాణలో శ్రేష్ఠమైన వాతావ‌ర‌ణం ఉంటుంది. రాష్ట్రంలో ఉత్పత్తైన విత్తనం ప్రపంచంలో ఎక్కడైన పండటం ఒక ప్రత్యేకత. తెలంగాణలో విత్తనాల పంట పండాలి.. ఆ విత్తనాలు ప్రపంచ దేశాల్లో వ్యవసాయ పంటలకు ఆధారం కావాలన్నది సర్కారు లక్ష్యం. పంట కాల‌నీల త‌ర‌హాలో విత్తన పంట కాల‌నీలను ఏర్పాటు చేయ‌గలిగితే తెలంగాణ‌ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎద‌గ‌డం పెద్ద విష‌యం కాద‌ని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విత్తన రైతుల‌కు త్వర‌లో గుర్తింపు కార్డులు
ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేక బాధపడుతున్న రైతులకు అరుదైన గౌవరం లభించనుంది. తెలంగాణ విత్తన‌ రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసే ప్రక్రియ‌లో భాగంగా విత్తన రైతుల‌కు త్వర‌లో గుర్తింపు కార్డులు అంద‌జేయాలని ఇస్టా సదస్సు నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాసిరకం, నకిలీ విత్తనాల నిరోధానికి ఇది ఎంతో దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భ‌విష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ‌పెట్టబోయే విత్తన పంట రాయితీలు, ఇత‌ర ప‌థ‌కాల‌కు విత్తన రైతు గుర్తింపు కార్డులు ప్రధాన భూమిక పోషించబోతున్నాయి. విత్తన రైతుల పూర్తి వివ‌రాల‌తో కూడిన డాటాబేస్ కంప్యూట‌ర్‌లో నిక్షిప్తం చేయాలని సర్కారు నిర్ణయించింది.

ముగింపు వేడుకకు హాజరుకానున్న గవర్నర్ నరసింహన్
ఇవాళ్టితో ముగియనున్న అంతర్జాతీయ విత్తన సదస్సుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత్‌ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో విత్తనోత్పత్తిదారుల ప్రయోజనాలు, ఈ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు తీసుకోబోయే చర్యలపై ఈరోజు మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ఇవీ చూడండి: గ్రామ గ్రామాన బలోపేతం దిశగా తెరాస

Intro:hyd-tg-65-27-heroin-srijeetha-av-c11

వర్థమాన సినీ తార సుజిత నగరంలో సందడి చేశారు

Body:బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ ఏర్పాటుచేసిన వస్త్ర ఆభరణాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు

Conclusion:భారతీయ సంప్రదాయ వస్త్రాలంటే ఇష్టమని ఆమె తెలిపారు
Last Updated : Jun 28, 2019, 1:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.