లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు సినీ హీరో శ్రీకాంత్ ఆపన్నహస్తం అందించారు. బంజారాహిల్స్ ప్రేమ్‌నగర్‌లో నివాసముంటున్న పేదలకు తన తనయుడు రోషన్‌తో కలిసి నిత్యావసర సరుకులు అందజేశారు.
లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలవాలని శ్రీకాంత్ కోరారు. కరోనాను నియంత్రించేందుకు పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులు ఎంతో కష్టపడుతున్నారని.. వారికి మనమంతా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ చవాన్, ఐసీపీ గోవర్ధన్ రెడ్డి, పంజాగుట్ట ఎస్ఐ నాగార్జున ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఎవరూ ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచొద్దు