యువ కథానాయకుడు నితిన్.. తన వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు వెళ్లిన నితిన్.. సీఎం కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రికి తన వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 26న జరగనున్న తన వివాహానికి రావాల్సిందిగా కోరారు.
అయితే ఈ నెల 26న హైదరాబాద్‌లోనే తన పెళ్లి జరగబోతున్నట్లు నితిన్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వివాహం చేసుకోనున్నట్లు తెలిపారు. ఈనెల 26న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు తన ప్రేయసి శాలిని మెడలో నితిన్ మూడుముళ్లు వేయనున్నారు.
డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఆకాంక్షించిన ఈ హీరో.. కరోనా వైరస్ కారణంగా తన వివాహన్ని వాయిదా వేస్తూ వచ్చారు. కానీ కొవిడ్ కేసులు పెరుగుతున్నందున హైదరాబాద్‌లోనే కుటుంబసభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకునేందుకు నితిన్ సిద్ధమయ్యారు.
ఇది చదవండి: యువహీరో నితిన్ పెళ్లికి ముహూర్తం ఖరారు