వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారులు సకాలంలో కాంక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు చేయించుకుని యధావిధిగా ప్రవర్తించడం ఆనందంగా ఉందని నాగచైతన్య సంతోషం వ్యక్తం చేశారు. కాంక్లియర్ ఇంప్లాంట్ చేయించుకున్న బాల బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. వినికిడి సమస్య పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.
జన్మించే ప్రతి వెయ్యి మందిలో నలుగురికి వినికిడి సమస్య ఏర్పడుతుందని.. ఈ సమస్య 90 శాతం కంటే ఎక్కువగా ఉంటే కాంక్లియర్ ఇంప్లాంట్ చికిత్సే ఉత్తమమని కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కర్ రావు తెలిపారు. కిమ్స్‌లో ఇప్పటి వరకు 150 ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు వివరించారు.
ఇవీ చదవండి: