ఇవీ చూడండి: రాగల రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు
జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు... నిలిచిన ట్రాఫిక్ - rains in telangana
కుండపోత వానల ధాటికి హైదరాబాద్ జనజీవనం స్తంభించింది. చెరువులు, వాగులు ఉప్పొంగడం వల్ల కొత్తగూడెం వద్ద విజయవాడ జాతీయరహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పెద్ద అంబర్‌పేట్, ఔటర్ కూడలి నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్దీకరిస్తున్నారు. గంటలకొద్దీ వాహనాలు ట్రాఫిక్‌లో నిలిచిపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు.
జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు... నిలిచిన ట్రాఫిక్
ఇవీ చూడండి: రాగల రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు