ETV Bharat / state

rain alert: నేడు, రేపు పలు చోట్ల భారీ వర్షాలు..!

రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది (Rain Alert for telangana) . నిన్న ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిందని ప్రకటించింది (weather updates).

rains in telangana
rains in telangana
author img

By

Published : Nov 18, 2021, 7:44 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది (Rain Alert for telangana). బుధవారం ఏర్పడిన అల్పపీడనం.. మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలిపింది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది (weather updates).

ఈ అల్పపీడనం ఇవాళ ఉదయానికి ఉత్తర తమిళనాడు తీరం వద్ద గల నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి చెన్నైకి ఆగ్నేయ దిశగా సుమారు 310కిమీ దూరంలో పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ఇది శుక్రవారం ఉదయం చెన్నైకి సమీపంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర తమిళనాడు వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. తూర్పు ఈశాన్య దిశగా అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ వైపు కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని వెల్లడించారు.

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఏపీ

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది (heavy rains in ap). చెన్నైకి ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. చెన్నై సమీపంలో రేపు తెల్లవారుజామున వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తీరం దాటే సమయంలో రాయలసీమలో తేలికపాటి జల్లులు, పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు(ap rains) కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. రేపటివరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరించింది. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

అల్పపీడనం ప్రభావం వల్ల కడపలో ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం(rains in Kadapa) కురుస్తోంది. గత మూడు రోజుల నుంచి వర్షాలు కురవక పోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ తెల్లవారుజాము నుంచి వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై మోకాలు లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉన్నాయి. కడప నగరంలో ప్రవహిస్తున్న బుగ్గ వంక పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

ఇదీ చూడండి: తమిళనాడులో భారీ వర్షాలు- తీర ప్రాంతాలకు రెడ్​ అలర్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.