ETV Bharat / state

Heavy Rains in Telangana Today : బీ అలర్ట్‌.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు జారీ - Rains in Hyderabad latest news

Heavy Rains in Telangana Today : ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల జోరు వానలు పడుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అతలాకుతలమైంది. ఆ జిల్లాలో విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో.. పలు ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. మరో 4 రోజుల పాటు పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Telangana Rain Alert 2023
Heavy Rains in Telangana Today
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 7:18 PM IST

Updated : Sep 5, 2023, 7:11 AM IST

Heavy Rains in Telangana Today బీ అలర్ట్‌ నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆరెంజ్‌ ఎల్లో హెచ్చరికలు జారీ

Heavy Rains in Telangana Today : దాదాపు నెల రోజుల విరామం తర్వాత... ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరు వానలు (Heavy Rains in Telangana) కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. రైల్వేస్టేషన్, బస్టాండ్, వీక్లీ మార్కెట్, బోధన్ రోడ్డు సహా పలు రహదారులు వాన నీటితో నిండిపోయాయి. పూలాంగ్ వాగు పరవళ్లు తొక్కుతోంది. మోపాల్ మండలంలో 15, ఇందల్‌వాయి, డిచ్‌పల్లిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Telangana Rain Alert 2023 : భారీ వర్షాల దృష్ట్యా నిజామాబాద్‌ జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జుక్కల్-బస్వాపూర్ మధ్య ప్రత్యామ్నాయ రోడ్డు.. వర్షానికి కోతకు గురవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదలతో డిచ్‌పల్లి-నిజామాబాద్ మధ్య రాకపోకలు నిలిచాయి. జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి, మోపాల్, నిజామాబాద్ గ్రామీణం, దర్పల్లి, ఇందల్‌వాయి మండలాల్లోని చెరువులు.. అలుగు పోస్తున్నాయి.

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లో భారీ వర్షం.. మరో రెండు రోజులు ఇలానే

సిరికొండలోని కప్పలవాగు ఉద్ధృతికి గడ్కోల్ వద్ద.. లో లెవెల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఇందల్‌వాయి మండలంలోని వాడి వద్ద.. వాగు ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని గాంధారి వాగు పోటెత్తడంతో.. పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. మాతు సంఘం వద్ద పశువుల కోసం వెళ్లి వాగులో చిక్కుకున్న రైతు సంగయ్యను.. ప్రత్యేక బోటులో వెళ్లి కాపాడారు.

భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్ల మధ్య భారీగా వరద నీరు చేరడంతో.. స్థానికుల రాకపోకలకు కష్టంగా మారింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కోరుట్ల ప్రాంతాల్లో.. పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గొట్టిముక్కుల, గోధుమగూడ వాగులు... ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

Heavy Rains in Hyderabad Today : ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్‌ రింగ్ రోడ్, హస్తినాపురం, సికింద్రాబాద్‌, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్‌ కాలనీల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై నీరు చేరడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రిలో జోరు వాన కురుస్తోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది.

Rain Alerts in Telangana : రాగల 48 గంటల్లో అల్పపీడనం.. 3 రోజులు ఆరెంజ్​ హెచ్చరికలు జారీ

ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి.. 24,000 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం.. 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 89 టీఎంసీలకు చేరుకుంది. నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి.. 28,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 3 గేట్ల ద్వారా.. 41,617 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల (Kadem Projects Gates Opened) చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ నాల ప్రాజెక్టులోకి 4,931 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రావడంతో.. మూడు గేట్లు తెరిచి 7,680 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Hyderabad Rains Today : భాగ్యనగరంలో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

Rain Alerts in Telangana : మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనం సోమవారం నాటికి వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఫలితంగా నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలోనే 11 జిల్లాలకు ఆరెంజ్‌, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు.. మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

Heavy Rain Forecast for Telangana : రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. హైదరాబాద్​లో రాత్రి నుంచి వర్షం

Viral Video Electricity Restoration by Swimming in Pond : విద్యుత్ ఉద్యోగుల సాహసం.. చెరువులో ఈదుకుంటూ వెళ్లి 11 కేవీలైన్​ విద్యుత్ పునరుద్ధరణ

Last Updated : Sep 5, 2023, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.