ETV Bharat / state

rains in Nellore : ఊరులన్నీ ఏరులైన.. నెల్లూరు - ఏపీలో వర్షాలు

వాయుగుండం ప్రభావంతో ఏపీలోని నెల్లూరు జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీటితో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

rains in Nellore
rains in Nellore
author img

By

Published : Nov 18, 2021, 7:45 PM IST

ఊరులన్నీ ఏరులైన.. నెల్లూరు

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేకచోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిర్చి, పొగాకు, మినప పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి తమకు కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం నుంచి 10 గేట్లు ఎత్తి పెన్నానదికి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. అనంతసాగరంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పశువుల వైద్యశాలలో వర్షపు నీరు చేరింది. వర్షపు నీటికి స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లెేక పోవడంతో ప్రమాదం తప్పింది.

భారీ వర్షానికి గుడూరులోని పంబలేరు కాలువ పొంగిపొర్లుతోంది. వరదనీటిలో కాలువ దాటుతుండగా ఆదిశంకర ఇంజినీరింగ్ విద్యార్థులు జారి పడ్డారు. తృటిలో ప్రమాదం తప్పింది. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో విద్యార్థులు తిరిగి వెనక్కి వెళ్లారు. వెంకటగిరిలొ భారీ వర్షాలు కురిశాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గొడ్డేరు కాజ్​వేపై ప్రవాహం సాగుతుంది.

ఇదీ చూడండి: తమిళనాడులో భారీ వర్షాలు- తీర ప్రాంతాలకు రెడ్​ అలర్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.