ETV Bharat / state

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. రానున్న మూడు రోజులు పలు చోట్ల వర్షాలు

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. నగరంలో పాతబస్తీతో పాటు మేడ్చల్, అల్వాల్, కూకట్​ పల్లి, కోఠి ఇంకా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సాయంత్రం వేళ కురిసిన వానతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్​లోని వాతావరణ కేంద్రం తెలిపింది.

Heavy Rains in Hyderabad today
Heavy Rains in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 6:27 PM IST

Updated : Sep 27, 2023, 7:39 PM IST

Heavy Rains in Hyderabad హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. రానున్న మూడు రోజులు పలు చోట్ల వర్షాలు

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy Rains) కురిసింది. మేడ్చల్ నుంచి క్రమక్రమంగా మొదలైన వర్షం నగరమంతటా విస్తరించింది. చార్మినార్​, బహదుర్​పురా, యాకుత్​పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్​, ఫలక్​నుమా ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కోఠి, అబిడ్స్​, బేగంబజార్​, నాంపల్లి, బషీర్​బాద్​, లక్డీకాపూల్​, హిమాయత్​నగర్​, ట్యాంక్​బండ్​, ఆసిఫ్​నగర్​, మెహిదీపట్నం, మాసాబ్​ట్యాంక్, బోరబండ, మోతినగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, మధురానగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌​, నిజాంపేట, బాచుపల్లి, గండి మైసమ్మ, కృష్ణాపూర్​, దుండిగల్​, కేపీహెచ్​బీ, మైత్రివనం, మాదాపూర్​, కీసర, మల్కాజిగిరి, ఖైరతాబాద్​ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

కుత్బుల్లాపూర్​, జీడిమెట్ల, బాలనగర్​, గుండ్ల పోచంపల్లి, బహదూర్​పల్లి, సూరారం, సుచిత్ర, జగద్గిరి గుట్ట ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్​ ప్రధాన రహదారిపై ట్రాఫిక్​ నిలిచిపోయింది. ఖైరతాబాద్​ రైల్వేగేట్​ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. యూసఫ్​గూడ, శ్రీకృష్ణా నగర్​, పూర్ణ టిఫిన్​ సెంటర్​ వీధిలోని దుకాణాల్లోకి వరద నీరు చేరుకుంది. నాగారంలో సుమారు గంట సేపు భారీవర్షం కురిసింది. ఈసీఐఎల్​లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. విజయనగర్​ కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీటితో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad Rains Latest News : అలాగే సికింద్రాబాద్, బోయినపల్లి, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యాట్ని, పారడైజ్, బేగంపేట్, అల్వాల్ ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. కుండపోతగా పడుతున్న వర్షానికి రహదారులన్నీ జలమమయ్యాయి. ఏకధాటిగా కురుస్తుండడంతో వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. అకస్మాత్తుగా కురిసిన వాన నీరంతా రోడ్లపై నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు : మరోవైపు రాష్ట్రంలో బుధవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావారణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Telangana Rains 2023 : సినుకు సినుకు సితారే.. వాగూవంకా పొంగేనే

Heavy Rain Lashs in Hyderabad : మంగళవారం తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం.. నేడు దక్షిణ ఛత్తీస్​గఢ్​ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిసింది. ఈ రోజు ద్రోణి ఉత్తర ఇంటీరియర్​ కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భల మీదుగా ఛత్తీస్​గఢ్​ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వివరించారు. పలుచోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వాతావరణ శాఖ సూచించింది.

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లో దంచికొట్టిన వర్షం.. రోడ్లన్నీ జలమయం

Telangana Weather Report : గుడ్​న్యూస్​.. వర్షాలు ఇక తగ్గుముఖం పట్టినట్లే!

Last Updated : Sep 27, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.