Heavy Rains in Hyderabad Today : హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన ఏకధాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు కాలనీలు, ఇళ్లు నీట మునిగాయి. అనేక చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. నగరంలో కురిసిన భారీ వర్షానికి(Heavy Rains in Hyderabad) పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వరదలతో రహదారులన్నీ జలమయం కాగా.. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షం కారణంగా విద్యార్థులు.. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల రహదారులపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం(Huge Traffic in Hyderabad) ఏర్పడింది.
Telangana Rains : రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
Hyderabad Floods Today : కూకట్‌పల్లిలోని అల్విన్‌కాలనీలో మంచును తలపించేలా వరద ప్రవాహంపై తెల్లని నురగ పేరుకుపోయింది. బౌరంపేటలోని ల్యాండ్ మార్క్-2 గేటెడ్ కమ్యూనిటీలో మ్యాన్‌హోల్ నుంచి వరద పోటెత్తింది. టోలిచౌకీలోని వంతెనపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ నుంచి మూసాపేట్ వెళ్లే ప్రధాన రహదారి సైతం వాహనాలతో కిక్కిరిసిపోయింది. మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద భారీగా వర్షపు నీరు నిలిచింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్‌లో ద్విచక్రవాహనాలు(Two wheelers) మునిగిపోయే స్థాయిలో రోడ్డుపై వరదనీరు పారింది. తెల్లాపూర్‌లో ఓ పాఠశాల బస్సు రోడ్డుపై కూరుకుపోయింది. యూసఫ్‌గూడలోనూ వరద ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి.
Huge Traffic in Hyderabad Rains : వరుణ్ బ్రో కొంచెం గ్యాప్ తీసుకో.. ఈ ట్రాఫిక్‌లో ఇళ్లు చేరేదెలా..?
Hyderabad Rains : బోయిన్‌పల్లిలోని హస్మత్ పేట ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు రావడంతో.. ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. రామన్నకుంట చెరువు సమీపంలోని శ్రీనివాసనగర్ కాలనీలో రహదారిపై పూర్తిగా నీరు నిలిచి వాహనాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. చింతల్‌లోని ఇంద్రసింగ్ నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏటా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు.
Huge Traffic in Hyderabad Due to Rains : గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలో భారీ వర్షానికి మైసమ్మగూడలోని ఇంజినీరింగ్ కళాశాలల హాస్టళ్ల వద్ద భారీగా నీళ్లు నిలిచాయి. మల్లారెడ్డి, సెయింట్ పీటర్స్, నర్సింహారెడ్డి కళాశాలల హాస్టళ్ల నుంచి బయటకు వచ్చేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఎర్రగడ్డ ప్రధాన రోడ్డుపై వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మ్యాన్‌హోల్‌లో చెత్త పేరుకుపోవడంతో వరదనీరు నిలిచిపోయింది.
మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వానలకు హైదరాబాద్‌లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతుండడంతో మూసీ పరివాహక ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు తెలిపారు.
రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన మిథున్ రెడ్డి(4) అనే బాలుడు మృతి చెందాడు. ప్రగతినగర్ తురక చెరువులో బాలుడి మృతదేహం డీఆర్ఎఫ్ సిబ్బందికి లభ్యమైంది. మరో ఘటనలో వర్షం తగ్గడంతో ఇంట్లో ఉన్న నీటిని తొలగించిన నిషాద్ బేగం(21) ఫ్యాన్ స్విచ్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృత్యువాత పడింది. స్థానికులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Moosarambagh Bridge Closed Due to Heavy Rains :మరోవైపు రాత్రి 9 గంటల నుంచి మూసారంబాగ్ బ్రిడ్జి మూసివేయనున్నారు. మూసీలో ప్రవాహం పెరిగనందున బ్రిడ్జి మూసివేయనున్నట్లుగా తెలుస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి నీరు విడుదల చేస్తున్నారు. అధికారులు 6 వేల క్యూసెక్కుల నీటికి మూసీకి విడుదల చేశారు.
Heavy Rains in Hyderabad Today : భాగ్యనగరం జలదిగ్బంధం.. ఎటుచూసినా వరదే.. అడుగు పెడితే బురదే