ETV Bharat / state

RAINS IN TELANGANA: నైరుతి రుతుపవనాలతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు! - heavy rains across the telangana coming 2, 3 days

రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. వానలు మొదలవ్వడంతో అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. రోడ్లపై నీరు నిలవడం, మ్యాన్‌హోల్స్ సహా వివిధ అంశాలపై అప్రమత్తమయ్యారు. గతేడాది అనుభవాల దృష్ట్యా వరంగల్‌లో అధికారులు ముందస్తుగా సన్నద్ధం అవుతున్నారు.

నైరుతి రుతుపవనాలతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు!

author img

By

Published : Jun 11, 2021, 4:09 AM IST

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రవేశంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. లాక్‌డౌన్‌ సాయంత్రం 5 గంటలతో ముగియగా.. ప్రజలు ఇళ్లకు వెళ్లే సమయంలో వాన పడటంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గురువారం రాత్రి 8 గంటల వరకు వచ్చిన రికార్డుల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్‌లో అత్యధికంగా 121.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో 95.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచింది. రానున్న మూడ్రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

అన్నివిధాలా సన్నద్ధం..

గతేడాది వరంగల్‌ను వరదలు ముంచెత్తాయి. నగరం పూర్తిగా జలదిగ్భందమైంది. వర్షాకాలం మొదలు కావడంతో.. ఈసారి వరదలు వస్తే ఎదుర్కొనేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ బృందాలు అన్నివిధాలా సన్నద్ధమవుతున్నాయి. లైఫ్ జాకెట్లు, పడవలు, ట్యూబులు ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఎలా కాపాడాలన్న దానిపై విపత్తు నిర్వహణ బృందాలకు హసన్‌పర్తి చెరువులో శిక్షణ ఇచ్చారు.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..

మరోవైపు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలకశాఖ ఆదేశాలు జారీ చేసింది. దోమల వ్యాప్తి చెందకుండా, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ స్పష్టం చేశారు. నీరు నిల్వ లేకుండా చూసేందుకు ప్రతి ఆదివారం పది గంటలకి పది నిమిషాలు కార్యక్రమాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: weather update: రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.