ETV Bharat / state

Rains in Hyderabad : హైదరాబాద్​లో వరుణుడి జోరు.. అప్రమత్తమైన బల్దియా యంత్రాంగం

Heavy Rains in Hyderabad : నిరంతరాయంగా పడుతున్న వర్షంతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. హైదరాబాద్‌లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో హుస్సేన్​సాగర్​ నిండుకుండలా మారింది. జంట జలాశయాలకు ప్రవాహం మొదలైంది. మరో మూడురోజుల వర్షసూచనతో బల్దియా యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తుబృందాలను రంగంలోకి దించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. జంటనగరాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం రెండురోజులు సెలవు ప్రకటించింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 21, 2023, 7:49 AM IST

హైదరాబాద్‌లో వరుణుడి జోరుకి జనం విలవిల

Heavy Rainfall in Hyderabad : తెరపివ్వకుండా ప్రతాపం చూపిస్తున్న వరుణుడి దెబ్బకు హైదరాబాద్‌ అతలాకుతలం అవుతోంది. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడం వల్ల నగరవాసులకు అవస్థలు తప్పడం లేదు. మురుగు నీటి కాల్వలు పొంగిపొర్లుతూ జనావాసాలను ముంచెత్తుతోంది. అంబర్‌పేట నుంచి ముసారాంబాగ్‌ వెళ్లే రహదారి పైకి వరద భారీగా చేరింది. మూసీ నదిలో ప్రవాహ వేగం పెరిగింది. ముసారాంబాగ్ వంతెన వద్ద వాహనదారులను నియంత్రిస్తూ ట్రాఫిక్‌ పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. నాచారం, మల్లాపూర్, తార్నాక , హబ్సిగూడలోని పలు ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లను ముంచెత్తింది. నాలుగు అడుగుల మేర నీరు చేరడం వల్ల స్థానికులకు అవస్థలు తప్పలేదు.

GHMC Actions on Heavy Rains : కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో వరద ముంపు ప్రాంతాలను జీహెచ్​ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలు పడుతున్నందున క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గాజులరామారం , బాలాజీ ఎన్‌క్లేవ్‌ చుట్టూ ఉన్న కాలనీల్లోకి వరద చేరికపై కారణాలేంటని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వానాకాలంలో తిప్పలు పడుతున్నందను శాశ్వత పరిష్కారం చూపాలని బల్దియా కమిషనర్‌కు స్థానికులు మొరపెట్టుకున్నారు.

జనానికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని రోనాల్డ్‌ రోస్‌ స్పష్టంచేశారు. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా అధికారులతో కమిషనర్‌ వర్షాలు, వరద పరిస్థితిపై సమీక్షించారు. ఇంజినీరింగ్, సర్కిల్​స్థాయి అధికారులు మాన్​సూన్​ అత్యవసర బృందాల సాయంతో ముంపు ప్రాంతాల్లో వరదను ఎప్పటికపుడు తొలగించాలని సూచించారు. హైదరాబాద్‌లో వరద సహా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు 157 మొబైల్ , 242 స్టాటిస్టికల్ బృందాలు ఏర్పాటు చేశామని రోనాల్డ్‌ రోస్‌ వివరించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని రోనాల్డ్​ రోస్ అప్రమత్తం చేశారు.

Traffic Problems Due To Rain : ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్​సాగర్‌లోకి ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. హుస్సేన్​సాగర్ నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది. ఇంకా వరద పెరిగితే గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారులపై నీళ్లు చేరి దాదాపు నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు గమ్యస్థానాలు చేరేందుకు గంటల కొద్దీ రోడ్లపైనే నిరీక్షిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌, లింగంపల్లి ఐటీ కారిడార్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. శిథిలావస్థకు చేరిన ఇళ్ల నుంచి పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని హబీబ్‌నగర్‌ పోలీస్​స్టేషన్‌ పరిధిలోని మంగర్ బస్తీ వాసులను తహసీల్దార్‌, కార్పొరేటర్‌ కోరారు.

భారీవర్షానికి కూలుతాయేమోనని ముందు జాగ్రత్తగా మేడ్చల్ జాతీయ రహదారి కండ్లకోయపై ఇరువైపుల ఉన్న చెట్ల కొమ్మలను అధికారులు తొలగించారు. ఖైరతాబాద్‌ జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మరుగు పొంగిపొర్లే మ్యాన్‌హోళ్లు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరా, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కలుషిత నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దానకిశోర్​ పేర్కొన్నారు.

Heavy Rains in Joint Rangareddy District : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిధిలో వానలు దంచికొడుతున్నాయి. చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు మున్సిపల్‌ కార్యాలయంలో కంట్రోల్​రూం ఏర్పాటు చేశారు. యాలాల మండలం గోవిందరావుపేట, పెద్దేముల్ మండలం గాజీపూర్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది.

వికారాబాద్ జిల్లా దోర్నాల వాగు ఉద్ధృతి కారణంగా నాగారం , అంపల్లి, గురుదొట్ల, రాస్నం, పగిడాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు దాటకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్టేషన్ ధారూర్ వద్ద మూసీ ఉద్ధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. గిర్గెటచ్​పల్లి వెళ్లే దారిలో రైల్వేవంతెన వద్ద వరద చేరికతో కోట్‌పల్లి, రాళ్లచిట్టంపల్లి, పీలారం, దేవరాపల్లి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిగి మార్కెట్ యార్డులోకి నీరు చేరడంతో దుకాణాలు మూసివేశారు. చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.